Railway Ticket Damage: రైలు ప్రయాణంలో టిక్కెట్టు చిరిగితే మీ టిక్కెట్టు చెల్లదా? వివరణ మీ కోసం..!

రైలులో ప్రయాణించడానికి, ముందు టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ టిక్కెట్‌ను పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.

Railway Ticket Damage: లక్షలాది మంది వ్యక్తులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. రవాణా ఖర్చులు చౌకగా ఉండటమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అవి చాలా సౌకర్యవంతంగా ఉండడం ఒక కారణం అయితే. తొందరగా గమ్యాన్ని చేరుకోవడం మరొక కారణం. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైలు (Rail) లో ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజు, లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే రైలు (Indian Railway Rail) లో ప్రయాణిస్తున్నారు.

రైలులో ప్రయాణించడానికి, ముందు టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి. అప్పుడు మీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భారతీయ రైల్వే (India Railway) లో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దూరం తక్కువనైనా ఎక్కువైనా రైలు ప్రయాణాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. మీరు TT లేదా TC కోసం అడిగితే, మీరు తప్పనిసరిగా టిక్కెట్‌ను చూపించాలి. మీకు చెల్లుబాటు అయ్యే టిక్కెట్ లేకపోతే మీపై చర్య తీసుకునే హక్కు TTకి ఉంటుంది.

Railway Insurance
image credit : Loksatta

అయితే, ప్రయాణంలో రైలు టిక్కెట్లు పోవచ్చు లేదా చిరిగిపోవచ్చు. దీంతో వారి టిక్కెట్టు చెల్లుతుందా లేదా అనే అంశం చర్చనీయాంశమైంది. మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీ టిక్కెట్‌ (Ticket) ను పోగొట్టుకుంటే, ముందుగానే TTE కి తెలియజేయండి.

పోయిన టిక్కెట్‌ను భర్తీ చేయడానికి TT మీకు డూప్లికేట్ టిక్కెట్‌ (Duplicate Ticket) ను అందిస్తుంది. అయితే, ఈ టికెట్ ఉచితం కాదని గుర్తుంచుకోండి. దీని కోసం ప్రయాణికులు రైల్వేకు పెనాల్టీ చెల్లించాలి. ప్రతి రైలుకు ఒక్కొక్కటిగా ఛార్జీలు చెల్లించాలి. స్లీపర్ లేదా సెకండ్ క్లాస్, అలాగే ఇతర రైళ్లలో డూప్లికేట్ టిక్కెట్ల ధర రూ. 50 ఉంటుంది.

టికెట్ చిరిగిపోతే ఎంత ఖర్చవుతుంది?

టికెట్ చిరిగిపోయినట్లయితే, ప్రయాణికుడు టిక్కెట్ విలువలో 25% చెల్లించాలి. ఆ తర్వాత, మీరు డూప్లికేట్ టిక్కెట్‌ను పొందుతారు.

Comments are closed.