Revanth Reddy Press Meet : మంచి ప్రజాపాలన అందించడం కోసమే ఈ ప్రజావాణి సదస్సులు, తద్వారా సమగ్ర అభివృద్దికి అవకాశాలు: సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి

ప్రజా పాలన సదస్సు భవిష్యత్తులో ప్రజలకు మరింత అభివృద్ధి చేయడంలో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ప్రజా పాలన సదస్సులు ఏ విధంగా నిర్వహించబోతున్నారో పూర్తి సమాచారాన్ని విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

Telugu Mirror: హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా మిత్రులతో ప్రజా పాలన సదస్సు మరియు ఆరు గ్యారెంటీలు గురించి పూర్తిగా వివరించారు, ప్రజా పాలన సభ కోసం ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విడదీశామని ప్రకటించారు, అయితే ఒక మండలానికి mro, అలాగే ఇంకో మండలానికి ఎంపీడీవో ఉదయం 8 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 12:00 నుంచి 6:00 వరకు ప్రజా పాలన సదస్సుని పర్యవేక్షిస్తూ (Supervising) ఉంటారని హామీ ఇచ్చారు, అదేవిధంగా ప్రతి గ్రామసభలో మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్ లని ఏర్పాటు చేశామని చెప్పారు.

ఏదైనా సమస్య వల్ల లబ్ధిదారుడికి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన సదస్సులో అప్లికేషన్ ఇవ్వటం కుదరకపోతే ఏమి కంగారు పడొద్దు అని ఆ తర్వాత కూడా మీ దగ్గరలో ఉన్న ఎమ్మార్వో (MRO) , ఎంపీడీవో (MPDO ) ఆఫీస్ లో మీ యొక్క అప్లికేషన్ సమర్పించవచ్చని తెలియజేశారు. అప్లికేషన్ తో పాటు దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా అధికారులు మీకు వివరంగా సభలో వద్ద చెబుతారని చెప్పారు.

కావాల్సిన డాక్యుమెంట్స్ మీకోసం మరొకసారి.

ఆధార్ కార్డు జిరాక్స్ (Aadhar Card Xerox)

కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate Xerox)

రేషన్ కార్డు జిరాక్స్ (Ration Card Xerox)

గ్యాస్ బుక్ (Gas Book)

తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు జైలుకి వెళ్తే అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ (F.I.R Copy)

మీ పాత కరెంటు బిల్లు కాపీ (Electricity Bill)

చేయూత పెన్షన్ కోసం మీరు ఈ కింది కేటగిరీ కి సంబంధించిన వారైతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్ లు

వికలాంగుల, వితంతు , గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, వృద్ధాప్య , చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, బీడీ టేకేదారు జీవన భృతి

ఒకవేళ లబ్ధిదారులకు రేషన్ కార్డు లేకపోయినా, 6 గ్యారెంటీల అప్లికేషన్ తో పాటు వాళ్లు అక్కడే రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు.

ప్రజా పాలన సదస్సులో అభ్యర్థుల నుంచి దరఖాస్తు లు సేకరించడం వలన ప్రజలకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ సదస్సు చాలా వరకు తోడ్పడుతుందని, లబ్ధిదారులకు ఆరు పథకాలు సరైన విధంగా చేరుతున్నాయా లేదా అనేది స్పష్టమైన నివేదిక వస్తుందని అంతేకాకుండా మా పనితనాన్ని మరియు బాధ్యతని మరింత పెంచుతుందని చెప్పారు.

అదేవిధంగా మీడియా మిత్రులు సమస్యలు కూడా నా దగ్గరికి చాలా వచ్చాయని అవి కూడా త్వరలోనే పరిష్కరిస్తానని, అంతేకాకుండా సచివాలయంలో మీడియా మిత్రుల కోసం ప్రత్యేక మీడియం కూడా ఏర్పాటు చేస్తామని విలేకరులకి హామీ ఇచ్చారు.

 

Comments are closed.