School and Colleges Bandh: విద్యార్థులకు అలర్ట్, రేపు స్కూళ్ళు, కాలేజీలు బంద్

NEET UG 2024 మరియు UGC NET పరీక్షల లీకేజీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్త పాఠశాల, కళాశాలల సమ్మెకు పిలుపునిచ్చాయి.

School and Colleges Bandh: నీట్ పరీక్ష (Neet Exam) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్ మంటలు ఇంకా చల్లారలేదు. దేశంలోని పరీక్షా విధానంలో చెరగని మచ్చ పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.రేపు (జులై 4) రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిస్తూ విద్యార్థి సంఘాలు ఆదేశాలు జారీ చేశాయి. నీట్ యూజీ పేపర్ (Neet UG Paper Leakage) లీకేజీకి నిరసనగా జూలై 4వ తేదీ (గురువారం) విద్యాసంస్థల వద్ద భారత్ బంద్‌ (Bharat Bandh) కు పలు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, యూనివర్సిటీలు, కార్యాలయాలు బంద్‌లో పాల్గొనాలని కోరారు.

NEET UG 2024 మరియు UGC NET పరీక్షల లీకేజీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్త పాఠశాల, కళాశాలల సమ్మెకు పిలుపునిచ్చాయి. పరీక్షలను అసమర్థంగా నిర్వహించే ఎన్టీఏ  (NDA)ను రద్దు చేయాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులందరూ బంద్‌, మార్చ్‌లు, నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Group 1 Candidates Alert
Image Credits : Save India Times

Also  Read: Gowtham Sawang Resign: ఏపీపీఎస్సీ చైర్మన్ రాజీనామా, చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం

వన్ నేషన్ – వన్ ఎగ్జామ్ (One Nation – One Exam) పేరుతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని విద్యార్థి సంఘాల పెద్దలు అన్నారు. మొత్తం పరీక్షా విధానం ఎలా విఫలమైందని విమర్శించారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అలాగే, గత పదేళ్లలో 70 పరీక్ష పేపర్లు లీక్ (Paper Leak) అయ్యాయని, దేశ ప్రతిష్టకు భంగం కలిగిందని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. దేశంలో విద్యావ్యవస్థ పై జరుగుతున్న దాడికి నిరసనగా జూలై 4న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ (SFI) కేంద్ర కార్యవర్గం పిలుపునిచ్చింది.

మొత్తం ఎనిమిది అభ్యర్థనలకు నిరసనగా విద్యార్థి సంఘాలు బంద్‌ నిర్వహించనున్నాయి. ఎన్టీఏ విధానాన్ని రద్దు చేయాలని, నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరారు. దీంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంకా, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు మరియు పరిశోధనా సంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాల (PHD Entrance) కోసం కొత్తగా ఏర్పాటు చేసిన నెట్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అభ్యర్థిస్తున్నాయి.

Comments are closed.