200 Units Free Electricity Telangana: అద్దె ఇళ్లలో ఉండేవారికి బిగ్ షాక్, ఉచిత కరెంటుపై కీలక నిర్ణయం!

ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉచిత విద్యుత్ బిల్లులు మార్చి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే.

200 Units Free Electricity Telangana: తెలంగాణ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆ నాలుగు పథకాల అమలులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు ఇప్పటికే అమలు చేశారు.

ఇటీవల ప్రవేశపెట్టిన 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉచిత విద్యుత్ బిల్లులు మార్చి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏడో తేదీ వరకు విద్యుత్ బిల్లులను జారీ చేశారు.

అయితే, హైదరాబాద్‌లోని ప్రజలు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటుని వినియోగించినప్పటికీ, వారిలో అధిక సంఖ్యలో జీరో బిల్లులు రాలేదు. సాధారణ పద్ధతిలోనే బిల్లులు అందాయి. ఒక్కో వ్యక్తికి విద్యుత్ బిల్లులు రూ.150 నుంచి రూ.700 వరకు బిల్లులు వచ్చాయి. జీరో బిల్లులు  అందుతాయని ఊహించిన వారు బిల్లుని చూసి ఆశ్చరపోయారు.

జీవనోపాధి కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్లిన వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా అట్టడుగు సామాజిక ఆర్థిక తరగతులకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. పట్టణ ప్రాంతంలో ఉపాధి మరియు మాన్యువల్ లేబర్‌లో  ఉండగా వారు అద్దెకు తీసుకున్న ఇళ్లల్లో  నివసిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, అద్దె ఇళ్లల్లో ఉన్నవారు తమ నెలవారీ విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని ఊహించారు. ఉచిత విద్యుత్, 500 సిలిండర్లు మరియు 2500 రూపాయలను అందించే మహాలక్ష్మి కార్యక్రమాల కోసం దరఖాస్తు చేశారు.

అయినప్పటికీ, అద్దె ఇళ్లల్లో నివసించే ప్రజలందరూ మొత్తం జీరోతో బిల్లులు రాలేదు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తు వినియోగిస్తున్నప్పటికీ, ఎప్పటిలాగానే వారికి కరెంటు బిల్లు వచ్చింది. అయితే, హైదరాబాద్ లో బతుకు తెరువు కోసం వచ్చి అద్దె ఇళ్లల్లో ఉండేవారికి తమ సొంత గ్రామాల్లోఉన్న సొంత ఇల్లులు ఉన్నాయి.

అయితే, ఇప్పుడు చాలా మంది హైదరాబాద్‌లోని అద్దె ఇళ్లల్లో ఉండేవారు తమ సొంత ఇళ్ల వద్ద మరియు అద్దె ఇంటి వద్ద ఉచిత కరెంటు కోసం దరఖాస్తులను సమర్పించారు. రేషన్ కార్డు ఆధారంగా వీరంతా చాలా చోట్ల దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సొంతూరిలో జీరో బిల్లు వచ్చి  వారికి హైదరాబాద్‌లో జీరో బిల్లు రాలేదు. మరి కొందరికి సొంత ఊరిలోను మరియు అద్దె ఇంట్లో బిల్లు రాలేదని వాపోతున్నారు.

రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి ఎలాంటి ముందస్తు షరతులు పెట్టకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని కోరుతున్నారు. స్వగ్రామంలో అందించకపోయినా హైదరాబాద్‌లో ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

200 Units Free Telangana

 

 

 

 

Comments are closed.