aarogyasri card new rules 2024: ఆరోగ్యశ్రీ కి కొత్త కార్డులు జారీ, ఇక రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం

చేయూత పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరోగ్య శ్రీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది.

aarogyasri card new rules  తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అలాగే, చేయూత పథకం కింద ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరోగ్య శ్రీ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది.

ఆరోగ్యశ్రీ పథకానికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ.

తాజాగా ఈ పథకం అమలుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో లబ్దిదారులకు తాజా కార్డులను జారీ చేస్తుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు జారీ చేసిన మాదిరిగానే యూనిక్ ఐడీతో కూడిన కార్డ్‌లు ప్రతి కుటుంబానికి పంపిణీ చేయనున్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యునికి సబ్ నెంబర్ ఇవ్వడంతో పాటు, అదే కార్డ్ ఆరోగ్య ప్రొఫైల్‌కు లింక్ చేసి రాష్ట్ర డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయనున్నారు.

సంవత్సరానికి రూ. 1,100 కోట్లు ఖర్చు.

ఇన్ని సంవత్సరాలు తెల్ల రేషన్‌ కార్డుతోనే ఈ పథకం అమలవుతూ వచ్చింది. రేషన్‌కార్డును ఆరోగ్యశ్రీతో ముడి పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఈ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ విషయంలో లబ్దిదారులను ఎలా గుర్తించాలి? అని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ఇప్పుడు అందరికీ.

రేషన్ కార్డు లేదా ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని 1.30 కోట్ల కుటుంబాలకు ఈ పథకం అమలు చేయాలనీ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా సంవత్సరానికి రూ. 1,100 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పథకాన్ని  అందరికీ అందజేస్తే రూ.400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మంది ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 293 ప్రైవేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

వైద్య చికిత్స విధానాల సంఖ్య పెంపు.

ఆరోగ్య శ్రీ ఇప్పుడు 1,376 విధానాలు మరియు 289 వైద్య చికిత్సలను అందిస్తోంది, అయితే ప్రభుత్వం వాటి సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో 72 కొత్త థెరపీ పద్ధతులను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వ అంతర్గత సమాచారం ప్రకారం, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

aarogyasri card new rules

 

 

 

 

Comments are closed.