Action Taken On Dharani Issues 2024: భూమి సమస్యల పరిష్కరం దిశగా

మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Action Taken On Dharani Issues: ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న భూసమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ధరణి పోర్టల్ వచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు కళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయాల చుట్టు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. తిరిగితిరిగి అలిసిపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరణి పోర్టల్ లోని సమస్యల పరిష్కారానికి గురువారం మార్గదర్శకాలు రూపొందించింది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నది. తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఎలకు అధికారాలను బదలాయించింది.
ధరణిపై ప్రత్యేక డ్రైవన్ ను మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ శాఖ చేపట్టనుంది. మండలాల్లోనే అదికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. 2,45,037 భూసమస్యలకు సబంధించి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిన్నింటిని అధికారులు మండలాల్లోనే పరిష్కరించనున్నారు.

2020కు ముందు భూములకు సబంధించిన సమాచారం అంతా రికార్డుల రూపంలోనే ఉండేది. ఎన్నో ఏళ్లకు సబంధించిన సమాచారం అంతా రెవెన్యూ ఆఫీసుల్లో ఉండేది. అయితే ఆ రికార్డులను భద్రపరచటం రెవెన్యూ అధికారులు, ప్రభుత్వానికి ఒక సవాల్ గా ఉండేది. ఈ సమస్యలను అధిగమించడం కోసం, ఆ సమాచారాన్ని అంతా ఆన్ లైన్ చేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదే సమయంలో ధరణి పోర్టల్ తెచ్చి రైతులు భూములకు సబంధించిన సమాచారం అంతా ధరణి పోర్టల్ లో ఆన్ లైన్ చేయించిది. ధరణి పోర్టల్ ను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయములో 29-10-2020 నాడు ప్రారంభించారు. ధరణి పోర్టల్ లో ప్రజలకు సంభందించిన వ్యవసాయ ఆస్తులు దాదాపుగా 1,45,58,000 ఎకరాల భూముల వివరములు ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కొనుగోలుదారుడు తన రిజిస్ట్రేషన్ ప్రక్రియను 20 నిముషములలో పూర్తి చేసుకొని, ఇ-పాసుబుక్ ను పొందవచ్చు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి పోర్టల్ లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని, రైతుల సమస్యలు పరిష్కారం కావటం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చెస్తామని చెప్పారు. ఆ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత రేవంత్ రెడ్డి జనవరిలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యలపై ఐదుగురి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమీటీ కన్వీనర్ గా సీసీఎల్ఏ సభ్యుడు ఉన్నారు. సభ్యులుగా ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ లను నియమించారు. ఈ కమిటీ ఇంకా ధరణి పోర్టల్ పై అధ్యయనం చేస్తూనే ఉంది. త్వరలోనే ఆ కమిటీ నివేధిక ఇచ్చే చాన్స్ ఉంది. ఈ సమయంలో ధరణిలోని సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అపరిషృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారం అయితాయని ఆశిస్తున్నారు. మండల కేంద్రాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ జరగబోతున్నది.

Action Taken On Dharani Issues

 

 

 

 

 

 

 

 

 

 

Comments are closed.