Beedi Workers Wages : వేతనాల పెంపుపై కీలక నిర్ణయం, ఎవరికంటే?

తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళ్తే..

Beedi Workers Wages : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమం కోసం చేసిన హామీలను నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర సామాజిక పథకాలకు పుట్టినిల్లుగా నిలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని మహిళా రైతులకు శుభవార్త అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ పరిశ్రమ కార్మికులకు (Beedi industry workers) మరో శుభవార్త అందించింది.

తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు (Beedi Workers)ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీడీ వ్యాపారంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్యాకర్లకు త్వరలో వేతనాలు పెంచనున్నట్లు సమాచారం. బీడీ కార్మికుల సంఖ్య పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాల మధ్య శనివారం జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి.

అయితే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న దాదాపు 7 లక్షల మంది కార్మికులకు ఈ చర్చలపై తీపి కబురు అందింది అనే చెప్పుకోవచ్చు. కొత్త వేతన పెంపుదల మే 1, 2024 నుండి ప్రారంభమయ్యే రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని ఒప్పందం కుదిరింది.

Beedi Workers Wages
అయితే గతంలో బీడీ రంగంలో పనిచేసిన బీడీ చుట్టే కార్మికులు, ప్యాకర్లకు నెలవారీ వేతన ఒప్పందం గడువు ఏప్రిల్ 30, 2024తో ముగిసింది. కాగా, పెరిగిన జీతాల అమలుపై చర్చించేందుకు శనివారం కార్మిక, యాజమాన్య సంఘాలు సమావేశమయ్యాయి.బీడీ పరిశ్రమలో పని చేసే కార్మికుల్లో 95% పైగా కార్మికులు బీడీలు చుట్టే కార్మికులే ఉన్నారు.

ప్రస్తుతం 1000 బీడీలు చూడితే రూ.245.08 వేతనం అందుతుంది. అయితే తాజా సమావేశంలో బీడీ రంగ యాజమాన్యాలు రూ. 4.25 పెంచాలని ముందుకు వచ్చింది. అయితే, పెరిగిన వేతనానికి పండుగ, సెలవులు, బోనస్‌లు కలిపితే 1000 బీడీలకు 249.99 వేతనం అందుతుంది.

అది పక్కన పెడితే బీడీ ప్యాకర్లు వారి ప్రస్తుత జీతంపై అదనంగా నెలకు రూ.3,650 ఇవ్వనున్నారు . ఈ చర్చల సమయంలో, బట్టివాలా, చెన్నివాలా మరియు బిడి సార్టర్ల నెలవారీ వేతనాలను ప్రస్తుత నెలవారీ వేతనం కంటే రూ.1,700 పెంచాలని కూడా నిర్ణయించారు. ఇంకా, జీతాల ఒప్పందం ఏప్రిల్ 30, 2026 వరకు అమల్లో ఉండనుంది. అయితే, ఈ చర్చల నేపథ్యంలో, బీడీ కార్మికులు వేతనాల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Beedi Workers Wages

Comments are closed.