సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి గుండె పోటు, పరిస్థితి విషమంగా ఉందంటున్న డాక్టర్లు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి గుండె పోటు రావడంతో హైదరాబాద్ కి తరలించారు. అతని పరిస్థితి ఎలా ఉందొ తెలుసుకుందాం.

Telugu Mirror : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra) ఖమ్మం రూరల్ తెల్దారిపల్లి నివాసంలో ఈరోజు ఉదయం గుండె పోటుతో శ్వాశ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఖమ్మంలో పరీక్షలు చేయగా లంగ్స్ ఇన్ఫెక్షన్ మరియు మైల్డ్ హార్ట్ స్టోక్ సూచనలు కనిపించగా డాక్టర్స్ సూచన మేరకు అంబులెన్స్ లో హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం, గచ్చిబౌలిలోని ఏజిఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శ : 

బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, తమ్మినేని వీరభద్రం పరిస్థితి తెలుసుకొని అతన్ని పరామర్శించడానికి ఏజిఐ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నాడు. డాక్టర్స్ తో మాట్లాడిన తర్వాత హరీష్ రావు, తమ్మినేని వీరభద్రం కుటుంబానికి ధైర్యం చెప్పాడు.

cpm-state-secretary-tammineni-veerabhadra-has-a-heart-attack-doctors-say-her-condition-is-critical
Image Credit : sakshi

Also Read : Salaar OTT release : రెబల్ స్టార్ నటించిన సినిమా సలార్, ఓటీటీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనుందో తెలుసా?

డాక్టర్స్ ఏం అంటున్నారు : 

తమ్మినేని వీరభద్రంకి అన్ని పరీక్షలు నిర్వహించగా అతను గుండె, కిడ్నీ మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. ప్రస్తుతం, ఊపిరితిత్తులోని నీటిని తొలగించాలని వైద్యులు సూచించారు. ఖమ్మం నుండే అతను వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతున్నాడని, ఇప్పుడు అతనికి వెంటిలేటర్స్ పైనే చికిత్స జరుగుతుందని వైద్య సిబ్బంది పేర్కొంది. ప్రస్తుతానికి మందులపైనే వైద్యం జరుగుతుందని డాక్టర్స్ చెప్పారు. తమ్మినేనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించగా, పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావొద్దని కమిటీ కార్యాలయం నిర్ణయించింది.

Comments are closed.