Half Day Schools Latest 2024: తెలంగాణలో నేటి నుండే ఒంటి పూట బడులు ప్రారంభం

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్కూల్ పిల్లలకు ఒంటి పూట బడులు ప్రారంభిస్తుంది.ఈరోజు  నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Half Day Schools Latest 2024 ఎండలు మండుతున్నాయి. భానుడు భగ్గుమంటున్నాడు. మరి కొన్ని రోజులు అయితే ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఈ ఎండల వల్ల జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో పిల్లలు, పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి వల్ల పిల్లలు స్కూల్స్ లో కూడా కూర్చోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటి పూట బడులు (Half Day Schools) నిర్వహించాలని ఆలోచిస్తుంది. ఒంటి పూట బడులు పెట్టని పక్షంలో తీవ్రంగా చర్యలు తీసుకుంటాం అని విద్యాశాఖ స్పష్టం చేసింది.

తెలంగాణాలో నేటి నుండి ఒంటి పూట బడులు..

ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) స్కూల్ పిల్లలకు ఒంటి పూట బడులు ప్రారంభిస్తుంది.ఈరోజు  నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండ తీవ్రత (Sun intensity) పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు స్కూల్స్ నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్ కి ఒంటి పూట బడులు ఈరోజు నుండు ప్రారంభం కావాలని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.

పది పరీక్షల జరుగుతున్న నేపథ్యంలో..

ఈ నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పదవ తరగతి పరీక్షలు ఉదయం జరుగుతాయి కాబట్టి పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు మిగతా తరగతులకు మధ్యాహ్నం 1:00 నుండి 5:00 వరకు క్లాసులు జరుగుతాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ఒంటి పూట  బడులు మధ్యాహ్నం నుండి నడుస్తాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యం..

నేటి నుండి ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు క్లాసులు జరుగుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్లాసులు జరిగిన అనంతరం మధ్యాహ్న భోజన (Lunch) సౌకర్యం ఉంటుంది. పిల్లలు భోజనం చేశాక ఇంటికి వెళ్తారు. అన్నీ పాఠశాలల్లో కూడా ఫాన్స్ సౌకర్యం ఉండేలా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎండ తీవ్రత పెరుగుతుండడంతో మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం విద్యాశాఖ చెప్పింది.

ఎండ, వేడి గాలులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఫాన్స్ , త్రాగు నీరు వంటి సౌకర్యాలు అన్నీ పాఠశాలలకు అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వడ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్త వహించండి.

Comments are closed.