Mahalakshmi Scheme : వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2,500, మహాలక్ష్మి పథకం అమలు

కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకి రూ.2,500 ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్ల వరకు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

Telugu Mirror : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మేనిఫోర్ట్ లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందించడం మరియు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి రూ.15 లక్షల వరకు పెంచిన విషయం మన అందరికి తెలిసిందే. ఇక ప్రజాపాలనలో స్వీకరించిన 5 గ్యారెంటీల దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా పూర్తి కావొస్తుంది.

కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకి రూ.2,500 ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్ల వరకు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే ఈ స్కీం ఎంపీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.

ఈ పథకానికి వయోపరిమితి 18-55 సంవత్సరాలు ఉండాలి. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహాజ్యోతి), రూ.500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం వంటి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఈ పథకాలను తొందర్లోనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

mahalakshmi-scheme-rs-2500-for-women-from-next-month-implementation-of-mahalakshmi-scheme
Image Credit : Andhrajyothi

Also Read : Prajapalana : ప్రజాపాలన దరఖాస్తులకు అప్లై చేసుకున్నారా? అయితే ఇప్పుడే అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకోండి

అయితే కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే రెండు పథకాలను నెరవేర్చగా మహాలక్ష్మి పథకం వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి నెలకి రూ.2,500 వారి ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా వచ్చే నెలలోనే విడుదల అయ్యేలా కనపడుతున్నాయి.

ఈ పథకం ఇంట్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ ఇంట్లో పెన్షన్ లబ్దిదారులు ఉంటె మరి ఈ పథకం కింద వారికి సహాయం అందుతుందా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంట్లో భర్త టాక్స్ కట్టినా లేక జీఎస్టీ  రిటర్న్ ఫైల్ చేసిన కూడా వారు అనర్హులుగా ఉంటారు. మహాలక్ష్మి పథకం ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వర్తించదు. ఈ పథకం రేషన్ కార్డు ఆధారంగా అమలు చేయబడుతోంది అంచనా.

మహాలక్ష్మి పథకానికి కావలసిన పత్రాలు : 

  • రేషన్ కార్డు
  • కుల ధృవీకరణ పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • ఓటర్ గుర్తింపు కార్డు
  • గ్యాస్ కనెక్షన్ రుజువు
  • ఆధార్ కార్డు తో లింక్ చేసిన ఫోన్ నెంబర్

ఈ పథకం కింద దాదాపు 10 మిలియన్ల మహిళలు లబ్ధి పొందుతున్నారని అంచనా వేస్తున్నారు. అర్హులైన మహిళలు నెలకి రూ.2,500 నగదు సహాయం అందుతుంది. ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేయబడుతుంది.

Comments are closed.