Rain Alert In Telangana: తెలంగాణాలో వర్ష సూచిక, ఇంకా ఎన్ని రోజులు అంటే?

ఇన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన వాతావరణం గత కొన్ని రోజులుగా శాంతించింది.

Rain Alert In Telangana: సూర్యుని వేడికి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు పనులన్నీ పూర్తి చేసుకుంటున్నారు.అయితే, గత మూడు రోజులుగా తెలంగాణ (Telangana) లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో ఇప్పటికే పలు చోట్ల ఈదురు గాలులు, వర్షాలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే, వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే సూచన ఉందని వెల్లడించింది.

నాలుగు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. వాతావరణం చల్లగా మారుతోంది. ప్రస్తుత వాతావరణం (Weather) మరో పది రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన వాతావరణం గత కొన్ని రోజులుగా శాంతించింది. రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 12, 13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మే 20 తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

TS Rain alert

తెలంగాణ మీదుగా ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం తమిళనాడుపై పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మే నెలలో ఉష్ణోగ్రత మార్పులు, అలాగే ఆయా జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మే 20 తర్వాత గణనీయమైన ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అత్యవసరం అనిపిస్తే బయటికి రావాలి?

అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచిస్తోంది. మే 20 తర్వాత తెలంగాణలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఎండలో బయటకు వెళ్తే నిమ్మరసం (Lemon Juice) , మజ్జిగ, కొబ్బరి నీళ్లు (Coconut Water) తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments are closed.