Raithu Bandhu Important Update 2024: రైతు బంధుపై కీలక అప్డేట్, విధివిధానాలు ఇవే!

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు పథకాలు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడికి కూడా అదే లక్ష్యంగా పెట్టుకుంది.

Raithu Bandhu Important Update తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజులు పూర్తి అయ్యేలోగా ఇచ్చిన ఆరు హామీలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పలు విషయాల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని మనకి తెలుసు.

రైతు బంధు పై కీలక అప్డేట్..

అయితే, హామీలపై నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చెట్లు, రోడ్లు, గుట్టలు, పెద్దపెద్ద భూ యజమానులకు రైతు బంధు అందిస్తున్నారని చెప్పికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళీ చేయకుండా రైతు భద్రత కోసం పటిష్ట ప్రమాణాలను రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన పేదలకు పథకాలు అందజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధు పెట్టుబడికి కూడా అదే లక్ష్యంగా పెట్టుకుంది. రైతు బంధును ఒకటి నుంచి ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం.. దాని ఆధారంగానే చట్టాలను రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది.

రైతు భరోసా 5 ఎకరాలకు పరిమితి

రైతు భరోసా కోసం 5 ఎకరాల పరిమితి విధిస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారికి మరింత బలంగా నిలుస్తున్నాయి. ఫలితంగా, ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న వారికి అది కూడా ఆ  5 ఎకరాల్లో సాగుచేసేవారికి మాత్రమే ఈ రైతు బంధు అందుతుందని లేదా వారికి మాత్రమే అందించేందుకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా, వ్యవసాయ కూలీలు ప్రారంభానికి ముందు కాకుండా సీజన్ ముగిసిన తర్వాత పంట మద్దతు అందించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఇప్పటికే ఐదు ఎకరాల వరకు రైతుబంధు చెల్లింపును అన్నదాతల ఖాతాల్లో వేసింది. కాగా, ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన కాబట్టి, ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుబంధుపై ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Raithu Bandhu Important Update

 

 

Comments are closed.