Rythu Runamafi : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి డబ్బులు జమ.

అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే

Rythu Runamafi : గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి పలు పథకాలను అమలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కోడ్ అమలులో ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు హామీ పథకాలను ప్రజలకు అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ పథకాలు అమలవుతున్నాయి. మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ (Rajeev Arogyashri) కార్యక్రమాలతో పాటు రూ. 500 గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ఇప్పటికే అమలు అయ్యాయి.

తెలంగాణలో విపరీతంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు బాగా కురుస్తున్నాయి. దీంతో రైతులు బాగా ఆందోళన చెందుతున్నారు. అకాలంగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టం వాటిల్లుతోంది.

అయితే, అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాజగా, కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న తిన్నాయి. అయితే, రైతులకు సహాయం అందించడం కోసం వారికి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 Rythu Runamafi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీల విమర్శలను సైతం లెక్కచేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారు.

ఆగస్టు 15లోగా రైతుల రెండు లక్షల రుణమాఫీ (Loan waiver) చేస్తానని హామీ ఇచ్చారు.డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీకి డెడ్‌లైన్‌ కూడా పెట్టారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరం అవుతున్నట్లు రేవంత్ సర్కార్ అంచనా వేస్తుంది.

లేని పక్షంలో తెలంగాణ ప్రభుత్వం వేరే పరిష్కారాలు ఏంటి అనే విషయం గురించి కూడా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతలో, ప్రభుత్వం రైతు కుటుంబాలకు రూ.2 లక్షలు మాఫీ చేస్తుంది. అంతకు మించిన ఋణం ఉంటే స్వయంగా చెల్లించుకోవాలి. అనేక బ్యాంకుల్లో రుణాలు ఉంటే, వాటిని సమిష్టిగా లెక్కిస్తారు.

గోల్డ్ సెక్యూర్డ్ రుణాలను (Gold secured loans) మాఫీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలిక రుణమాఫీ మాత్రం అందడం లేదనే చర్చ జరుగుతోంది. రైతులకు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

Rythu Runamafi

Comments are closed.