Telangana Exclusive New District : తెలంగాణలో మరో కొత్త జిల్లా.. 2024 లో CM రేవంత్ రెడ్డి కీలక హామీ.

Telangana Exclusive New District |సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ, సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.

Telangana Exclusive New District : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress party) సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెవవేరుస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే గతంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు

తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. పది జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణను బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మొదట 31 జిల్లాలుగా విభజించింది. దాన్ని అనుసరించి ములుగు, నారాయణపేట జిల్లాలను ప్రకటించడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది.అయితే మరో జిల్లా ఏర్పాటుపై ప్రశ్న తెరపైకి వచ్చింది. అది ఎక్కడో కాదు. జంటనగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌ను (Secunderabad) జిల్లాగా చేయాలంటూ వినతులు వెల్లువెత్తుతుండగా, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Telangana Exclusive New District

సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. గత కొంత కాలంగా సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని పట్టుబడుతున్న గుర్రం పవన్‌కుమార్‌ గౌడ్‌ను రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే పవన్ కుమార్ గౌడ్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు పెరుగుతున్నాయి.

ఎంపీ ఎన్నికల (MP Election) నేపథ్యంలో జిల్లా ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి మంచి నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.మరోవైపు బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి కార్యాలయానికి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు సికింద్రాబాద్‌ను మరో జిల్లాగా ఏర్పాటు చేస్తానని రేవంత్‌రెడ్డి వాగ్దానం చేశారన్న వార్తలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Telangana Exclusive New District

Comments are closed.