TS Rain alert, helpful information : తెలంగాణాలో మరో 5 రోజులు వర్షాలు, ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్, ఆందోళనలో రైతులు

మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

TS Rain alert : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి చల్లటి కబురుని ఇచ్చింది. మరో ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది.

 ఆ జిల్లాలకు యెల్లో అలెర్ట్.. 

నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, , మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

భగ భగమంటున్న సూర్యుడు 

బుధవారం వివిధ జిల్లాల్లో వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 41.1 డిగ్రీల సెల్సియస్, వనపర్తి జిల్లా కొత్తకోటలో 41.1, రొగొండ, జయశంకర్ భూపాలపల్లిలో 41 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయిలో 41 డిగ్రీలు మరియు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. అయితే ఆలస్యంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు కోతకు చేరుకున్నాయని, ఈ సమయంలో వర్షాలు కురిస్తే పంటలు తడిసి ముద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

TS Rain alert

 

 

 

Comments are closed.