TSRTC New Buses 2024: టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం, కొత్త బస్సులు వచ్చేస్తున్నాయి, ఇక వారికి దిగులు లేదు

మహాలక్ష్మి పథకం రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు రవాణాను అందిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది.

TSRTC New Buses 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే, మహిళలకు ఇది తీపి కబురు కావొచ్చు కానీ పురుషులకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. ఉచిత బస్సు సౌకర్యం మంచిదా? కదా? అని అర్ధం కానీ పరిస్థితుల్లో పురుషులు ఉన్నారు.

బస్సుల్లో సీట్ల కోసం పురుషులు ఇబ్బంది 

మహాలక్ష్మి పథకం రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు రవాణాను అందిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది. బస్సుల రద్దీ విపరీతంగా పెరిగింది. దానితో పురుషులకు సీట్లు ఉండడం లేదు. బస్సుల్లో సీట్లు దొరకక, కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళల రద్దీ, బస్సులు లేకపోవడంతో నగర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం 

అయితే, పురుషులకు కూడా శుభవార్త అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో బస్సుల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లీట్‌కు మరిన్ని బస్సులను జోడించి అన్ని రూట్లలో నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 30 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్యను 1000కు పెంచేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. అలాగే ఇతర బస్సుల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో సిటీ బస్సులో ప్రయాణించే పురుషులకు ఊరట లభిస్తుంది. ఇక బస్సుల్లో ప్రయాణించే వారికి సీట్లు దొరుకుతాయి.

ఇదిలా ఉండగా సిటీ బస్సులతో పాటు పల్లెలు, పట్టణాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల రద్దీ కూడా పెరిగింది. తెలంగాణ మహిళలు ఉచిత బస్సు సౌకర్యంతో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కొత్త బస్సుల గురించి ఆలోచించడం ప్రారంభించింది. రద్దీ దృష్ట్యా, అన్ని బస్సుల్లో సీటింగ్ మోడల్‌ను సవరించాలని TSRTC నిర్ణయించింది. బస్సుల్లో కూడా మెట్రో రైలు మోడల్ సీట్లు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

TSRTC New Buses 2024

 

 

Comments are closed.