Wine Shops Close Telangana: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాక్. వైన్ షాప్ లు బంద్, ఎందుకో తెలుసా?

తెలంగాణాలో 24 గంటలపాటు వైన్ షాప్ లు మూతపడనున్నాయి. అయితే ఈ నిభంధన కేవలం హైదరాబాద్, సికిందరాబాద్ నగరాల పరిధిలోనే అమలవుతుంది. వివరాలు తెలుసుకుందాం.

Wine Shops Close Telangana: మందుబాబులకు తాగకుండానే కిక్కు ఎక్కే వార్తను అందించింది తెలంగాణ సర్కార్. ఒకవేళ మందు తాగి ఉంటే కిక్కు దిగే న్యూస్ మందుబాబులకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ఇది మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లలో వైన్ షాప్ లు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట. శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎల్లుండి అంటే ఏప్రిల్ 17న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ తన ఆదేశాలలో స్పష్టం చేశారు. జంట నగరాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలో ఉన్న బార్లు కూడా 24 గంటలు మూసి వేయాలని ఆదేశించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాల్లో శాంతి భద్రతలను కాపాడే దృష్ట్యా వైన్ షాపులు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వైన్ షాపులు బంద్ అని తెలియడంతో జంటనగరాలలోని మందుబాబులు వైన్ షాప్ ల ముందు క్యూ కట్టారు.

తాగుతూ చిల్ అవుతున్నారు

ఎండాకాలం అంటే మందు బాబులకు గుర్తుకు వచ్చేది చల్లని బీరు. వేసవి ఎండ నుంచి ఉపశమనంగా భావించే బీర్ ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా చల్లగా ఓ బీర్, కాస్త స్టఫ్ దగ్గర పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. రాష్ట్రంలో ఎండలు మంటెక్కిస్తున్నాయి. తెలంగాణాలో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో మద్యం ప్రియులు చల్లబడేందుకు బార్ షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. బీర్లను ఫుల్లుగా తాగుతున్నారు. బీర్లు వినియోగం విపరీతంగా పెరగడంతో ఒక్కసారిగా స్టాక్ లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణాలోని పలు జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది. బీర్ల స్టాక్ ఖాళీ అవడంతో రాష్ట్రంలోని అనేక జిల్లాలలో బ్రాండెడ్ కంపెనీ బీర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన కంపెనీలకు చెందిన బ్రాండ్ బీర్లను నిర్ణీత కేటాయింపుల ఆధారంగా ఒక్కో షాపునకు 20-25 బీర్ కేస్ లు ఇస్తున్నాగాని, ఇవి ఏమాత్రం సరిపోవడంలేదని మద్యం షాపుల యజమానులు వాపోతున్నారు.

మండే ఎండలకు బీర్లకు డిమాండ్

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ప్రతి రోజూ 60 వేల నుంచి 80 వేల కేస్ లకు పైగా బీర్లు అమ్ముడవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. వేసవిలో బీర్లను ఎక్కువగా తాగడం మూలాన అదనంగా మరో 20 వేల కేస్ లు అవసరం అవుతాయి. అయితే మద్యం డిస్టిలరీల నుండి ప్రస్తుత డిమాండ్ కు సరిపడా స్టాక్ లేకపోవడంతో 60 వేల నుంచి 80 వేల కేస్ లను మాత్రమే మద్యం డిపోలు బీర్లను మద్యం షాపులకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండలు అధికమవడంతోపాటు మద్యం తాగేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది బీర్లు లాగిస్తున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగినాయి. తెలంగాణా అంతటా బీర్లకు డిమాండ్‌ పెరిగిందని మద్యం షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎక్సైజ్‌ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బీర్ల డిస్టిలరీల నుండి రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల కేస్ ల బీర్ల స్టాక్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని వీటిలో హైదరాబాద్‌, రంగారెడ్డి మరియు మేడ్చల్‌ జిల్లాల్లో ఎక్కువగా బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపింది. గతేడాది ఏప్రిల్‌ నెలలో ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే దాదాపుగా 12 లక్షల కేస్‌లకు పైగానే బీర్ల అమ్మకాలు జరిగితే, ఈ సంవత్సరం 15 లక్షల కేస్‌లకు పైగా డిమాండ్‌ ఉంటుందని మద్యం వ్యాపారులు అంటున్నారు. గణాంకాల ప్రకారం తెలంగాణాలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేస్ ల బీర్లు విక్రయాలు జరుగుతున్నాయి.

Wine Shops Close Telangana

 

 

 

 

 

 

Comments are closed.