Zero Electricity Bill : వేసవిలో ఎక్కువ విద్యుత్ వాడితే, అర్హులైన వారికి జీరో బిల్ రాదా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..

గృహజ్యోతి పథకం కింద నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 27, 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.500 రూపాయల గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో కూడిన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Zero Electricity Bill : తెలంగాణలో (Telangana) ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన ప్రభుత్వం మరి కొన్ని హామీలు నెరవేర్చేందుకు కసరత్తు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుండి జీరో కరెంట్ బిల్లుల వరకు పథకాలను ప్రవేశపెట్టింది.

అమలు చేసిన గృహజ్యోతి పథకం  

గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి 27, 2024న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.500 రూపాయల గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో కూడిన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దీంతో ఫిబ్రవరికి సంబంధించిన బిల్లులు మార్చి మొదటి వారంలో జీరో బిల్లులుగా వచ్చాయి. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించిన బీపీఎల్ (BPL) కుటుంబాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఇంతలో ఎండలు విపరీతంగా పెరగడం వల్ల గృహజ్యోతి లబ్ధిదారులను కలవరపెడుతోంది.

మరి వేసవిలో ఎక్కువ విద్యుత్ వాడితే..

ఈ ఏడాది వేసవికాలం వచ్చేసింది. దీంతో అన్ని ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండ వేడిమికి ఇంట్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ నెలలో 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని కరెంట్ బిల్లు జీరో కరెంటు బిల్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు.

Gruha Jyoti Scheme

అయితే, గృహజ్యోతి పథకానికి అర్హులైన మరియు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే వ్యక్తులకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఒక నెల కరెంట్ 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడితే, ఇక పూర్తిగా జీరో కరెంటు బిల్ (Zero Electricity Bill) రాదా? లేకపోతే ఏ నెల బిల్లుని బట్టి ఆ నెల వరకే జీరో బిల్ వస్తుందా? అనే విషయం గురించి తెలియాల్సి ఉంది.

వేసవి 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడితే జీరో బిల్ రాదా?

అయితే, గృహజ్యోతి లబ్ధిదారులుగా ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి ఇబ్బందులు ఉండవని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తే కరెంట్ బిల్లు జీరో వస్తుంది అని చెప్పారు.

అందుకే ఎండాకాలం కదా అని ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు వాడితే కరెంట్ బిల్లు మోత తప్పదు. గృహజ్యోతి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు విద్యుత్ వినియోగాన్ని 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకుంటే బెటర్. లేకపోతే, మీరు పూర్తి కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంతలో, అర్హత ఉన్న వారికీ ఆటోమేటిక్ గా జీరో బిల్లులను రూపొందించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను బిల్లింగ్ మెషీన్‌లలో ఉంచడానికి పవర్ ఏజెన్సీ నిబంధనలను రూపొందించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన అప్లికేషన్ మరియు రేషన్ కార్డ్ ఆధారంగా అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. ఇక ఆలా చేస్తే, వారికి జీరో బిల్లులు వస్తాయి.

Zero Electricity Bill

Comments are closed.