Tirumala Update: తిరుమలలో రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీ, ఇప్పటికైనా దర్శనమివ్వు స్వామి!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత శ్రీవారి దర్శనానికి భక్తులు పద్దెనిమిది గంటలపాటు వేచి ఉండాల్సి వస్తుంది.

Tirumala Update: తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. వేసవి సెలవులు (Summer Holidays) ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది.

కలియుగ దైవం అయిన శ్రీనివాసుని జన్మస్థలమైన తిరుమలకు వేలాది మంది భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొంతమంది తిరమల (Tirumala) కు కాలినడకన వెళ్తే, మరికొందరు బస్సులో లేదా ప్రైవేట్ వాహనాల్లో స్వామిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వెంకన్న దర్శనానంతరం శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు.

ATirumala

Also Read: Tirumala Trains Cancellation : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, పలు రైళ్లు రద్దు.. కారణం ఇదేనా!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలను దర్శించుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వచ్చి పూజలు చేస్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు (Tirumala Special Darshanam Tickets) కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఈరోజు, తిరుమల వైకుంఠం వెయిటింగ్ స్ట్రక్చర్‌లోని మొత్తం 31 కంపార్ట్‌మెంట్లను భక్తులు ఆక్రమించారు. బయట వరకు క్యూ లైన్ విస్తరించింది. సహజంగానే శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమల భక్తులతో నిండిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచిత శ్రీవారి దర్శనానికి భక్తులు పద్దెనిమిది గంటలపాటు వేచి ఉండాల్సిందే. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.04 కోట్లు వచ్చిన్నట్లు అధికారులు (Officers) తెలిపారు.

Comments are closed.