TSRTC wonderla Tour: వండర్ లా టూర్ కి బంపర్ ఆఫర్, వారికి మాత్రమే అవకాశం  

మీరు TSRTC బస్సు లో వండర్లాకు వెళ్లాలనుకుంటే, మీరు పార్క్ ఎంట్రీ టిక్కెట్లపై 15% తగ్గింపును అందుకుంటారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

TSRTC wonderla Tour: మే నెల వచ్చింది. ఇక ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. వేడితో పాటు వడగాలులు కూడా అధికంగా ఉండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మే ప్రారంభంలోనే ఇలా ఉందంటే ఇక రోహిణి కార్తిలో వచ్చే ఎండల పరిస్థితి ఏంటి అని ప్రజలు ఇప్పుడే భయపడుతున్నారు.

ఈ ఎండలకు తట్టుకోలేక చాలా మంది చల్లటి ప్రదేశాలకు వెళ్తున్నారు. చల్లగా ఉండే ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. నగరంలోని వాటర్ పార్కులకు క్యూ లు కడుతున్నారు. ఇలా వాటర్ పార్కులకు వెళ్లాలని మీరు కూడా అనుకుంటే హైదరాబాద్ (Hyderabad) లో వండర్ లా (wonderla) ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది.

TSRTC  బస్సులో వండర్ లా వెళ్లే వారికి గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. మీరు TSRTC బస్సు లో వండర్లాకు వెళ్లాలనుకుంటే, మీరు పార్క్ ఎంట్రీ టిక్కెట్లపై 15% తగ్గింపును అందుకుంటారు.

TSRTC bus
Image Credit : Sakshi Education

హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల నుండి వండర్లాకు TSRTC బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించేవారు పార్క్ ఎంట్రీ టిక్కెట్లపై 15% తగ్గింపును పొందవచ్చు. వండర్లా టికెట్ బూత్‌లో వారి TSRTC టిక్కెట్‌లను చూపించే వ్యక్తులకు మాత్రమే తగ్గింపు చెల్లుతుంది. ఈ ప్రమోషన్ ఆన్‌లైన్ బుకింగ్‌లకు చెల్లదు.

ఈ ఆఫర్ రెగ్యులర్ అడల్ట్ మరియు పిల్లల టిక్కెట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ ఇతర రకాల టిక్కెట్‌లకు చెల్లదు. అదే రోజు ప్రయాణించే టిక్కెట్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్‌పై డెస్టినేషన్ కూడా వండర్లానే ఉండాలి. మీరు అదనపు వండర్లా టికెట్ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీరు TSRTC బస్ టికెట్ డిస్కౌంట్ ను ఉపయోగించలేరు. ప్రతి ఆఫర్‌కు ఒక డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది.

వేసవి సెలవుల కారణంగా వండర్లా కూడా రకరకాల డిస్కౌంట్లు ఇస్తోంది. సిజ్లింగ్ ఏప్రిల్ లో 20% తగ్గింపును ఇచ్చిన సంగతి తెలిసిందే. 10వ మరియు ఇంటర్ పరీక్షలు రాసిన  విద్యార్థులకు పార్క్ ప్రవేశ టిక్కెట్లపై 35% డిస్కౌంట్ ను ఇచ్చింది. వండర్ లా ఆఫర్‌ల గురించిన వివరాలను https://www.wonderla.com/లో చూడవచ్చు.

TSRTC wonderla Tour

Comments are closed.