Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, వైన్ షాప్స్ బంద్

ఎన్నికలు జరిగే మే 11వ తేదీ ఆరు గంటల నుంచి మే 13వ తేదీ ఆరు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, పబ్బులు మూసివేయనున్నారు.

Wine Shops closed: ఎండలు మండుతున్నాయి. వేసవి తాపం నుండి కొంత ఉపశమనం పొందడానికి, మందు బాబులు వైన్ షాప్స్ ముందు క్యూ లు కడుతున్నారు. ఒక ఎండ వేడిమికి తట్టుకోలేక కొన్ని చల్లని బీర్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైన్ షాప్స్ బంద్ చేస్తున్నారంటే.. బీర్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మందు బాబులకు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులు డ్రై డేగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం (telangana state) లో లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) మే 13న జరగనున్నాయి, ఇది లోక్‌సభకు ఎన్నికల సీజన్ ముగింపునకు గుర్తుగా ఉంది. ఇక, లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఓటింగ్ ప్రక్రియ సా సాఫీగా కొనసాగుతుంద‌ని హామీ ఇచ్చేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Wine Shops Close Telangana
image credit: spencers, onmanorama,

ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే తెలంగాణలోని మందు బాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. తెలంగాణా (Telangana) లో మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికలు జరిగే మే 11వ తేదీ ఆరు గంటల నుంచి మే 13వ తేదీ ఆరు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, పబ్బులు మూసి వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

అదనంగా, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు అంటే జూన్ 4న వైన్ షాపుల (wine shops) ను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపుల మూసివేతతో పాటు వివిధ ప్రాంతాలు మరియు నగరాల్లో బార్‌లు మరియు కాఫీ షాపుల మూసివేత ఉంటుంది.

 

Comments are closed.