Milan 2024 Outstanding Naval Exercise in Vizag: ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్నా అతి-పెద్ద మల్టీనేషనల్ నావెల్ ఎక్సర్‌సైజ్ వివరాలు.

తూర్పు నౌకాదళానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం గత కొన్ని రోజులుగా సాగుతున్న 2024 మిలన్ తో చాల సందడి గ మారింది, చాల దేశాల నుంచి వచ్చిన వివిధ భారీ నౌకలు మరియు వాటి విన్యాసాలు విశాఖ మరియు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలను చాల ఆకట్టుకుంటున్నాయి.

Milan 2024-Multilateral Naval Exercise:

మిలాన్ అనేది ఒక నావెల్ ఎక్సర్‌సైజ్, ఇది రెండు సంవత్సరాల ఒకసారి నిర్వహించబడుతుంది .ఈ కార్యక్రమంలో పాల్గొనే దేశాల మధ్య వృత్తిపరమైన సెమినార్లు ,సామాజిక కార్యక్రమాలు ,క్రీడా పోటీలు జరుగుతాయి. 1995 నుండి ఈ కార్యక్రమం రెండు సంవత్సరాల ఒకసారి జరుగుతుంది .మహాసముద్రాల మధ్య ఆర్థిక అభివృద్ధికి ఎంతో సహాయపడుతుంది. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడానికి మరియు సరుకు రవాణాకు సులువైన అదే విధంగా అతి తక్కువ ఖరీదైన మార్గంగా సముద్ర మార్గాలు ఉపయోగపడుతాయి. ఈ సముద్ర మార్గాలను కాపాడడంలో నావికా దళాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి.

Milan 2024 – Participation of 51 friendly foreign countries:
51 ఫారిన్ కంట్రీస్ ఈ 2024 నావెల్ ఎక్సర్‌సైజ్ లో పాల్గొన్నాయి, సోమవారం(19 ఫిబ్రవరి 2024) నుండి 9 రోజులపాటు ఈ ఎక్సర్‌సైజ్ జరగనున్నది. ఇందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా సహా దాదాపు 50 దేశాలు పాల్గొంటున్నాయి. సముద్ర కార్యకలాపాలలో ఈ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం మిలాన్ లక్ష్యం . ఈ కార్యక్రమంలో ఫైటర్ జెట్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాయి, 2020లో జరగాల్సిన మిలాన్ కరోనా కారణంగా రెండు ఏళ్ళ తర్వాత 2022లో జరిగింది. ఈ సంవత్సరం (2024) లో కూడా మిలాన్ ను మల్లి ఇండియా నిర్వహించబోతుంది. ఇందులో INS విక్రాంత్(INS Vikranth) మరియు INS విక్రమాదిత్య(INS Vikaramadithya) తో పాటు భారతదేశానికి చెందిన 20యుద్ధనౌకల విదేశాలకు చెందిన అనేక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

Milan 2024– Speech of R. Hari Kumar Chief of the Naval Staff of India and Commanding Officer Rajesh Pendharkar.
నౌకాదళ ప్రధాన అధికారి హరికుమార్ మరియు తూర్పు నౌక దళ ప్రధాన అదికారి రాజేష్ పెండల్కర్ మాట్లాడుతూ…మేము 60 దేశాలను ఆహ్వానించామని, అందులో 50 దేశాలు వస్తున్నాయని ,కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల వల్ల రాలేకపోతున్నాయని తెలిపారు, మిలాన్ లో చాలా అర్థవంతమైన చర్చలు జరగనున్నాయని, చాలా ఉపయోగకరమైన పరస్పర సమాచారం పంచుకుంటున్నామని, క్రీడలు మరియు ఫారిన్ కంట్రీ ఆఫీషియల్స్ మన దేశాన్ని సందర్శించబోతున్నారని, 8 విదేశీ నౌకలు వస్తున్నాయని, నగరంలో పరేడ్ జరగబోతుందని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని దీనివల్ల నౌకాదళానికి విదేశీ ప్రతినిధులకు విశాఖకు ఎంతో ప్రయోజనం అవాలని ఆశిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సహా నౌకాదళ ప్రధానాధికారి హరికుమార్ గారు హాజరవుతున్నారు. దాదాపు 30 కన్నా కళాబృందాలు ప్రదర్శన ఇచ్చాయి. దేశీయ కళ సంస్కృతిక బృందాలు విశాఖపట్నం కి విచ్చేసిన విదేశీయులను తమ కళతో కనువిందు చేయనున్నాయి.

 

Comments are closed.