Nothing Phone 2A special Addition : ప్రపంచంలో మంచి ఆదరణ పొందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల్లో నథింగ్ ఫోన్ ఒకటి. లండన్ కు చెందిన ఈ కంపెనీ నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ అడిషన్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పటికీ నథింగ్ కంపెనీ నుండి విడుదలయిన రెండు ఫోన్లపై ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. నథింగ్ ఫోన్ 2ఏ ని ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా భారత్ లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. దీని యొక్క ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు ఇప్పుడు చూద్దాం.
నథింగ్ ఫోన్ 2ఏ ధర, ఫీచర్లు
ఈ ఫోన్ 6.7″ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120 రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1300 నిట్‌ల బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఇది MediaTek Dimension 7200 Pro CPU ద్వారా శక్తిని పొందుతుంది. Android 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అయిన నథింగ్ 2.5ని అమలు చేస్తుంది.
ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5000mAh, మరియు ఇది 45W వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా 50 MP మెయిన్ మరియు 50 MP అల్ట్రా వైడ్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. ఇది వీడియో కాల్స్ మరియు సెల్ఫీల కోసం 32 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది.
ధర పరంగా చూస్తే, ఈ ఫోన్ మూడు వేరియేషన్లలో వస్తుంది. 8GB+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 23999 ఉండగా .. 8GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 25999 ఉంది. అదే 12GB RAM+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 27999 గా ఉంది. ఈ ఫోన్‌కి తగ్గింపు ఆఫర్‌లను పరిశీలిస్తే, Flipkart Axis బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లిస్తే 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
మీరు Citi బ్రాండ్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10% తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ వైట్ కలర్ మరియు బ్లాక్ కలర్ రంగులలో లభిస్తుంది. అయితే, తాజాగా ఈ కంపెనీ ఈ ఫోన్‌ను నేవీ బ్లూ కలర్‌లో కూడా తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కేవలం భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.