Whats App Offline Photo Sharing: వాట్స్ అప్ కొత్త ఫీచర్,ఆఫ్‌లైన్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే ?

వాట్సాప్ లో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు మరియు ఇతర సమాచారాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్‌లైన్‌లో షేర్ చేయవచ్చు.

Whats App Offline Photo Sharing: స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా వాట్స్ అప్ వినియోగిస్తారు. డైలీ లైఫ్ లో వాట్స్ అప్ కూడా ఒక భాగమైపోయింది. మెసేజెస్ (message) , కాల్స్ (calls) , వీడియో కాల్స్ (video calls) , స్టేటస్ (status) , ఫొటోస్ (photos) ఇంకా వీడియోస్ (videos) పంపడం వంటివి ఎక్కువగా వాట్స్ అప్ (whats app) నుండే చేస్తారు. ప్రజలు విరివిగా ఉపయోగించే వాటిల్లో వాట్స్ అప్ ముందంజలో ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. వాట్స్ అప్ వచ్చిన కొత్త ఫీచర్ గురించి మీ తెలుసా? ఇంటర్నెట్ లేకపోయినా కూడా వాట్స్ అప్ లో ఫొటోస్, వీడియోస్ పంపొచ్చు. డేటా లేకుండా ఎలా సెండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Whats App Offline Photo Sharing ఆఫ్లైన్ లో ఫొటోస్, వీడియోస్ షేరింగ్ ఎలా ?
WhatsApp తాజాగా 2GB వరకు ఫైల్‌లను ఫార్వర్డ్ చేసే అవకాశాన్ని కల్పించింది. వాట్సాప్లో ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా (With out internet connection) ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు మరియు ఇతర సమాచారాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్‌లైన్‌లో షేర్ చేయవచ్చు. అయితే, ఫైల్ షేరింగ్ సమీప మొబైల్‌ల మధ్య మాత్రమే అనుమతిస్తుంది. వాట్సాప్ కూడా బ్లూటూత్ ద్వారా ఫైల్‌లను షేర్ చేసుకోవచ్చు.

వాట్స్ అప్ ఇప్పుడు దాని బీటా ఎడిషన్‌లో ఈ ఫీచర్ ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ని ఉపయోగించడానికి, ఫోటో గ్యాలరీ (Photo Gallery) ని తెరవడానికి మరియు లొకేషన్ పొందడానికి మీ ఫోన్‌ని అనుమతించండి. సమీపంలోని ఫోన్లు కూడా అల్లో చేయాలి. సాధారణంగా, చాలా యాప్‌లు ఇటువంటి ఫీచర్లు పని చేయాలంటే అల్లో యాక్సిస్ అని అడుగుతాయి. అన్ని యాప్‌ల ఫీచర్‌లు సరిగ్గా పని చేయడానికి ఈ అనుమతులను మంజూరు చేయడం కూడా చాలా అవసరం.

వాట్స్ అప్ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను పర్యవేక్షిస్తుంది.ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియదు. ఇది త్వరలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. మీరు ఫైల్ షేరింగ్ ఎంపికను ఉపయోగించకూడదనుకుంటే, మీరు దానిని మాన్యువల్‌గా ఆఫ్ చేయొచ్చు.

వాట్స్ అప్ కొత్త అప్డేట్

వాట్సాప్ తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. వాట్స్ అప్ ఇంటర్‌ఫేస్ కూడా చిన్న మార్పులు చెందింది. ఇది ‘అప్‌డేట్స్’ అనే కొత్త ట్యాబ్‌ను కూడా తీసుకొచ్చింది, దీనిలో మీరు అనేక WhatsApp ఛానెల్‌లను వీక్షించవచ్చు. వాట్సాప్ చాట్‌లు, అప్‌డేట్‌లు, కమ్యూనిటీలు మొదలైన ట్యాబ్‌లను కిందకు తీసుకొచ్చింది.

మరోవైపు వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను (New Feature) పరీక్షిస్తోంది. చాట్ లాక్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఎవరి చాట్ అయినా లాక్ చేయాలనుకుంటే పాస్ వర్డ్ (password) సెట్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు.

Whats App Offline Photo Sharing

Comments are closed.