Whatsapp Pass key: మీరు ఐఫోన్ యూజర్సా, సింపుల్ గా పాస్వర్డ్ లేకుండా వాట్స్ అప్ లాగిన్ చేయండి ఇలా

స్మార్ట్ ఫోన్ ఉందంటే ఖచ్చితంగా వాట్స్ అప్ వినియోగిస్తారు. మెసేజెస్, కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్, ఫొటోస్ ఇంకా వీడియోస్ పంపడం వంటివి ఎక్కువగా వాట్స్ అప్ నుండే చేస్తారు.

Whatsapp Pass key: ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ (whatsapp) ముఖ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన యాప్స్‌లో ఇదీ ఒకటి. ఎప్పటికప్పుడు యూజర్ల (users) అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్స్ అప్ పాస్ వర్డ్ (password) లేకుండా ఐఫోన్ లో అకౌంట్ ను లాగిన్ చేయవచ్చు.

మెసేజింగ్ యాప్ ఇప్పుడు మీ iPhone మోడల్‌ని బట్టి Face ID లేదా Touch ID ద్వారా iPhone పాస్‌కీలను సపోర్ట్ చేస్తుంది.

గత ఏడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్‌ (android) లోని వాట్సాప్ యూజర్లు పాస్‌కీలను అందుకున్నారు. పాస్‌కీ ఫీచర్లు (pass key feature) ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్స్ అప్ సెట్టింగ్‌లలో ఆప్షన్ తీసుకొని వచ్చాక త్వరలో iOS అప్డేట్ ను తీసుకొస్తుంది.

పాస్‌కీలు మీ నమోదిత ఫోన్ నంబర్‌కు SMS ద్వారా పాస్‌వర్డ్‌లు మరియు టూ-పాస్వర్డ్ అథేంటికేషన్ ను ఉపయోగించి లాగిన్ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు. WhatsAppలో ఈ ఫీచర్ ప్రారంభించడానికి, మీరు ముందుగా మీ iPhoneలో ఫేస్ ID లేదా టచ్ IDని ఉపయోగించాలి.

పాస్‌కీలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, హ్యాకర్లు మీ WhatsApp డేటాను రిమోట్‌గా యాక్సెస్ చేయలేరు. దీనికి మీ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ (bio metric information) అవసరం. ఐఫోన్ వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాల కోసం పాస్‌కీలను ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • వాట్స్ అప్ యాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.
  • “Acount”పై క్లిక్ చేయండి.
  • పాస్‌కీల ఆప్షన్ ను ఎంచుకోండి .
  • పాస్‌కీలను క్రియేట్ చేయండి.
  • కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ లాక్ తర్వాత పాస్‌కీని క్రియేట్ చేయొచ్చు.

అయితే, అప్‌గ్రేడ్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో వాట్సాప్ ప్రకటించలేదు. వాట్స్ అప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది.

బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ ఇతర వినియోగదారులతో ఆఫ్‌లైన్‌లో ఫొటోస్, వీడియోస్ పంపించుకోవచ్చు .

WhatsApp యాప్‌లో డయలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. చాట్ లాక్ ఆప్షన్ ను కూడా వాట్స్ అప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్స్ అప్ ఇంటర్‌ఫేస్ కూడా చిన్న మార్పులు చెందింది.

ఇది ‘అప్‌డేట్స్’ అనే కొత్త ట్యాబ్‌ను కూడా తీసుకొచ్చింది, దీనిలో మీరు అనేక వాట్స్ అప్ ఛానెల్‌లను వీక్షించవచ్చు. వాట్సాప్ చాట్‌లు, అప్‌డేట్‌లు, కమ్యూనిటీలు మొదలైన ట్యాబ్‌లను కిందకు తీసుకొచ్చింది.

Whatsapp Pass key

Comments are closed.