Telugu Mirror : గర్భధారణ సమయంలో సరైన పౌష్టికాహారం అవసరమని, దీని వలన పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తల్లి ఆరోగ్యకరమైన పోషకాహారం(nutrition) తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన తాజా అధ్యయనం ప్రకారం, గర్భధారణ ఆరంభంలో పోషకాహారం తీసుకునే మహిళలకు పుట్టిన పిల్లలకు మాత్రమే కాదు రాబోయే తరం పిల్లలకు కూడా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు(Scientists) తెలిపారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
గర్భ దారణ సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోవడం వలన సుమారు రెండు తరాల వారి యొక్క మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. ఆస్ట్రేలియా(Australia)కు చెందిన మోనాష్ యూనివర్సిటీలో జన్యు నమూనాలను సేకరించి జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. నిజానికి ఈ అధ్యయనం ప్రాజెక్టులో ఒక భాగం. ఇది తల్లి యొక్క ఆహారం తన పిల్లలకు మాత్రమే కాకుండా ఆమె మనవళ్లు మరియు మనవరాళ్ల మెదడులను కూడా ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది.
Tea Effect on children : మీ పిల్లలు ‘టీ’ తాగుతున్నారా? అయితే ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..
గర్భధారణ సమయంలో పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. నేచర్ సెల్ బయాలజీలో ప్రచురించబడ్డ ఈ అధ్యయనం ప్రకారం, కొన్ని ఆహారాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయని కనుగొన్నారు. ప్రెగ్నెన్సీ(Pregnancy) సమయంలో ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యం తో పాటు పుట్టబోయే వారి యొక్క ఆరోగ్యము మరియు రాబోయే తరాల యొక్క ఆరోగ్యం అనగా మానసిక ఆరోగ్యం ను దృఢంగా చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
గర్భధారణ సమయంలో ఆహారంలో వీటిని చేర్చడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమనగా యాపిల్స్(Apples) మరియు తులసి, రోజ్ మేరీ, థైమ్, ఒరేగానో మొదలైన కొన్ని రకాల మూలికలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు సక్రమంగా పనిచేయడానికి అవసరమయ్యే కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మెదడులోని నరాల కణాల అక్షాంశాలను పరిశీలించగా ఆక్సానులలో ఏదైనా పని చేయని పరిస్థితులు , మరియు మెదడు పనిచేయకపోవడం అలాగే న్యూరో డెజనరేషన్(Neuro degeneration) ప్రమాదానికి దారి తీస్తాయని పోకాక్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు.
Precautions for hair colour : దీర్ఘకాల నల్లని జుట్టు కోసం..తప్పని సరి జాగ్రత్తలు మీ కోసం..
పోకాక్ ఈ విధంగా అన్నారు. ఆహారంలో లభించే సహజ లక్షణాలు ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయో లేదో తెలుసుకునే ప్రయత్నం మేము చేసాము. అధ్యయనంలో ఏమి కనుగొన్నామంటే , ఆపిల్స్ మరియు వివిధ రకాల మూలికలలో ఉండే ఉర్సొలిక్ యాసిడ్ ఆక్సాన్ పెళుసు దనాన్ని తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. స్పింగో లిపిడ్(sphingo lipid) అని పిలవబడే ఈ రకమైన కొవ్వు నెక్స్ట్ తరంలో కూడా ఆక్సాన్ ను కాపాడుతుందని పోకాక్ చెప్పారు. దీని అర్థం ఏమనగా, తల్లి తీసుకునే ఆహారం ఆమె సంతానం యొక్క మెదడులను మాత్రమే కాకుండా రాబోయే తరాల మెదడులను కూడా ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.
ఈ అధ్యయనం యొక్క నివేదిక ప్రకారం “గర్భిణీ స్త్రీలందరికీ ఆరోగ్యకరమైన మరియు పోషకాహారాన్ని ఎందుకు తీసుకోవాలో మరింత స్పష్టతను తెలియజేస్తుంది” అని పోకాక్ తెలిపారు.
గమనిక :ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడింది. పాఠకులకు జ్ఞానము మరియు అవగాహన పెంచడానికి సంబంధిత కథనం తయారు చేయబడింది. పై కథనంలో పేర్కొన్న సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.