సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఏర్పడిన వ్యవస్థ పోలీస్ (Police) అలాగే సమాజం (Society) లో నేరాలకు పాల్పడిన వారిని కనిపెట్టి వారిని నేరాలకు పాల్పడకుండా కట్టడి చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. కానీ కొన్నిచోట్ల వారే నేర స్వభావం కలిగి ఉంటున్నారు. ఎవరైనా అదుపుతప్పి ప్రవర్తిస్తే ఖండించాల్సిన పోలీసులే ఎక్కడ పడితే అక్కడ వారి చెడు ప్రవర్తన (Bad behavior) ద్వారా ప్రజలలో పోలీస్ వ్యవస్థ పట్ల చులకన భావం ఏర్పడేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన పోలీసులే క్రమశిక్షణ (Discipline) తప్పి ప్రవర్తిస్తున్నారు.
బీహార్‌లోని నలంద జిల్లాలో అత్యవసర విభాగాని (Emergency Services) కి చెందిన ఇద్దరు పోలీసుల మధ్య అటు ఇటుగా అర్ధగంట (Half an hour) సేపు తీవ్ర స్థాయిలో వాగ్వాదం (Quarrel) జరిగింది. రహుయి పోలీస్ స్టేషన్ సరౌండింగ్ (Surrounding) లోని సోహ్సరాయ్ హాల్ట్ (Halt) సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గొడవ కారణంగా తీవ్ర స్థాయిలో వ్రాయలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల (Social Media) లో వైరల్ గా మారింది. ఇద్దరు పోలీసులు ఒకరినొకరు బూతులతో రెచ్చిపోవడం, భౌతిక దాడి చేసుకోవడం వీడియోలో చూడొచ్చు.
ఇద్దరు పోలీసుల మధ్య వివాదం తలెత్తడంతో వారిద్దరినీ విడదీయడం (Breaking Up) అక్కడ ఉన్నవారికి కష్టంగా మారింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసుల సేవ సామాన్య ప్రజలలో హాస్యాస్పదం (Ridiculous) గా మారింది. గొడవ జరిగేప్పుడు అక్కడ ఉన్న వారు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే తన్నుకుంటున్నారు, ఇక జనం మీద జరిగే దాడులకు వీళ్లేం స్పందిస్తారంటూ’’ అక్కడ ఉన్న ప్రజలు (The People) వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి, రాహుయ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి నందన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న పోలీసులు ఇద్దరూ (Both of them) రాహుయ్ పోలీస్ స్టేషన్‌కు సంభంధించిన వారు కాదని అన్నారు. వీరు 112 అత్యవసర విభాగానికి చెందిన పోలీసులుగా ఉన్నారని తెలిపారు.
Also Read : ప్రయాణీకుల బ్యాగులను తనిఖీ చేస్తూ డబ్బు దొంగిలిస్తున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది
రెండు గేదెల దొంగతనం కేసులో 78 సంవత్సరాల వృద్దుడు 58 సంవత్సరాల తరువాత అరెస్ట్
ఈ విషయం తన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని నందన్ కుమార్ సింగ్ తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో (Video) ద్వారానే నందన్ కుమార్ సింగ్ కు ఈ సమాచారం వచ్చింది. వివాదం విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం ఎందుకు జరిగిందో ఎంక్వయిరీ చేస్తున్నారు. కాగా, ఇద్దరు పోలీసులను సస్పెండ్ (Suspend) చేసినట్లు ఎస్పీ అశోక్ మిశ్రా తెలిపారు. వివాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా ఇంకా తెలియరాలేదని అధికార వర్గాలు చెప్తున్నప్పటికీ.. లంచం (Bribe) విషయంలోనే వివాదం చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…