రెండు గేదెల దొంగతనం కేసులో 78 సంవత్సరాల వృద్దుడు 58 సంవత్సరాల తరువాత అరెస్ట్

కర్ణాటకలో రెండు గేదెలను ఒక దూడను దొంగిలించిన కేసులో 78 సంవత్సరాల వృద్దుడిని 58 ఏళ్ల తరువాత అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతుంది .

కర్ణాటక పోలీసులు రెండు గేదెలు, ఒక దూడను దొంగతనం చేసిన పాత కేసులో 78 సంవత్సరాల వ్యక్తిని అరెస్టు చేశారు.అయితే, ఈ కేసు (Case) ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్ళ క్రితం గేదెలను దొంగిలించిన కేసులో అరెస్ట్ చేశారు అతని ప్రస్తుతం ఆతని వయస్సు 78 సంవత్సరాలు .

కర్ణాటకలోని బీదర్ (Bider) ప్రాంతానికి చెందిన గణపతి విఠల్ వాగూర్‌ అనే వ్యక్తికి 1965 సంవత్సరంలో 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన రెండు గేదెలను (Buffalos) దొంగతనం చేసినట్లు కేసు నమోదైంది.

అప్పటి జమానాలోనే ఒకసారి అరెస్టైన వాగూర్ బెయిల్ (Bail) పై రిలీజ్ అయిన తర్వాత అదృశ్యమై పోయారు. వాగూర్ తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఇంకొక వ్యక్తి 2006లో మృతి (Died) చెందాడు.

దొంగతనం జరిగి 58 ఏళ్లు (58 Years) గడిచిన తర్వాత ఆ కేసులో వాగూర్ మరోసారి అరెస్టయ్యారు.

వాగూర్‌ను తిరిగి గత వారం అరెస్టు చేసిన తర్వాత కోర్టు (Court) అతని వయస్సును దృష్టిలో పెట్టుకొని బెయిల్‌పై విడుదల చేసింది.

58 ఏళ్ళ తరువాత కేసు ఎలా బయటికొచ్చింది?

వాస్తవంగా ఈ కేసును ఎప్పుడో అటకెక్కింది. కానీ, కొన్ని వారాల కిందట పెండింగ్ కేసు ఫైళ్లను (Files) పోలీసులు పరిశీలిస్తుండగా, ఈ దొంగతనం విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది.

గేదెల దొంగతనం సంఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జరిగింది. ఈ కేసులో వాగూర్ రెండుసార్లు పారిపోయాడు. రెండుసార్లు కూడా మహారాష్ట్రలో ఉన్న వేరువేరు గ్రామాలలో పోలీసులకు చిక్కాడు.

1965లో వాగూర్ తో కలసి కృష్ణ చందర్ అనే వ్యక్తి తాము గేదెలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టిన తరువాత కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిందని పోలీసులు తెలిపారు.

కానీ, బెయిల్ పై విడుదలైన తర్వాత వారిద్దరూ కోర్టు సమన్లు, వారెంట్లను (Warrants) పట్టించుకోవడం మానేశారు.

పోలీసు బృందాలు బీదర్ నుండి కర్ణాటకతో పాటు చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రలోని గ్రామాలలో వెతికినప్పటికీ వీరి ఆచూకీ (Whereabouts) లభ్యం కాలేదు.

వ్యవసాయ కూలీలుగా పనిచేసే వీరిద్దరూ పోలీసులకు దొరకలేదు.

78-year-old man arrested after 58 years in two buffalo theft case
image credit : World Animal Foundation

ఇప్పుడు నిందితుడు ఎలా దొరికాడు

బీదర్ జిల్లా పోలీసు చీఫ్ చెన్నబసవన్న వివిధ మాధ్యమాలతో ఈ కేసు గురించి వివరిస్తూ గత నెలలో ఈ కేసు మళ్లీ (Again) విచారణకు వచ్చినట్లు తెలిపారు.

‘‘ 1965లో వాగూర్ మొదటిసారి తప్పించుకున్నపుడు మహారాష్ట్రలోని ఉమర్గా గ్రామంలో అతన్ని పట్టుకున్నారు. అతని ఆచూకీ ఇప్పుడు ఏమైనా అక్కడ దొరుకుతుందేమో అని విచారించే క్రమంలో మా పోలీసులు ఉమర్గా గ్రామస్తులతో మా పోలీసులు సంభాషించడం మొదలుపెట్టారు. అప్పటి సంఘటన గురించి తెలిసిన ఒక వృద్ధురాలిని (Old Women) పోలీసులు గుర్తించారు. ఆమెతో వాగూర్ గురించి అడిగినప్పుడు అతను బ్రతికి ఉన్నట్లు వెల్లడించింది.” అని చెన్న బసవన్న పేర్కొన్నారు.

Also Read :Cinema Download : సినిమా డౌన్లోడ్ చేసే సమయంలో మోసగాళ్ళ వలలో పడకండి

Online Job : ఆన్ లైన్ జాబ్ పేరిట కుచ్చుటోపీ , మోసపోయిన యువకుడు

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న తకలాగావ్‌లో వాగూర్ జీవిస్తున్నట్లు వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. 50 సంవత్సరాల తర్వాత పోలీసులకు దొరికిన అతి పెద్ద క్లూ ఇది.

వాగూర్ తకలాగావ్ లోని ఆలయం (Temple) లో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిసి పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు.

పోలీసులతో తానే వాగూర్ ని అనిచెప్పిన ఆయన, కోర్టు అంటే ఉన్న విపరీత భయం వలన అప్పట్లో పారిపోయానని చెప్పారు.

చివరకు ఆయనను కర్ణాటకకు తిరిగి తీసుకువచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ప్రొ బోనో (Pro Bono) అనే పేరుగల న్యాయ సహాయం చేసే సంస్థ వాగూర్ తరఫున కేసు వాదించేందుకు లాయర్‌ను సమకూర్చింది. కేసు విచారణ జరుగుతోంది.

Comments are closed.