ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవన విధానం మరియు ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఊబకాయం (Obesity) సమస్య అధికమైంది. ప్రతి ఒక్కరు తమ దినచర్య (daily routine) మరియు ఆహారం పట్ల తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలి. అయితే అధిక బరువు ఉన్నవారు, ఊబకాయం సమస్యతో బాధపడేవారు బరువు తగ్గాలి (Weight Loss) అనుకున్నట్లయితే అంజీర్ (Fig) చాలా బాగా పనిచేస్తుంది. అత్తిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు గా ఉంటుంది.ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై (Detoxify) చేస్తుంది. అత్తిపండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి అత్తిపండ్ల నీరు తీసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది. అత్తిపండ్లలో పిండి పదార్థాలు, ఫైబర్ (Fiber), పొటాషియం, క్యాల్షియం కు ఇది మంచి మూలం.దీంతో కండరాలు (Muscles), ఎముకలు (Bones) దృఢంగా మారతాయి.
అంజీర్ నీటిని ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా వాడాలో మరియు బరువు తగ్గించడంలో ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
Also read : ఎముకలు బలంగా ఉండాలంటే, ఈ పండ్లను మీ డైట్లో చేర్చాల్సిందే
దానిమ్మ పండు చేస్తుంది ఆరోగ్యానికి ఎంతో మేలు
దీనికి కావలసిన పదార్థాలు:
అంజీర్- నాలుగు నుంచి ఐదు, ఒక గ్లాసు- నీళ్లు, ఒక టీ స్పూన్- తేనె.
తయారీ విధానం:
రాత్రిపూట పడుకునే ముందు అంజీర్ పండ్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ (Cut) చేయాలి. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దీనిలో అంజీర్ ముక్కలు వేసి నానబెట్టాలి. దీంతో అంజీర్ మెత్తగా మారుతుంది. ఈ నీటిని తాగటం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. లేదా నీళ్లల్లో నాని ఉన్న అంజీర ముక్కలను పేస్ట్ లా చేసి దీనిలో తేనె కలుపుకొని త్రాగటం వలన కూడా బరువు తగ్గవచ్చు. తేనె (Honey) కలపడం వలన దీని రుచి మరింత పెరుగుతుంది. లేదా అంజీర్ నీళ్లను (Anjeer Water)మాత్రమే తాగినా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంజీర్ నీళ్లు లేదా అంజీర్ పేస్ట్ (Paste) ను ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇది మధుమేహాన్ని (Diabetes) నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
ఇది బరువును ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం:
అంజీర్ నీటిని తరచుగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అంజీర్ లో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్(Anti Oxidant) వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది బరువును అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది అని పరిశోధనలో తేలింది. అంజీర్ నీటిని(Water) క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అంజీర్ లో క్యాలరీ (Calories) లు తక్కువగా ఉండి, ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా బాగా దోహదపడుతుంది.
కాబట్టి బరువును నియంత్రించాలి అనుకునేవారు ప్రతిరోజు అంజీర్ నీటిని తాగాలి. బరువును అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇది మంచి (Best) ఎంపికగా చెప్పవచ్చు.
గమనిక : ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది పాఠకులకు జ్ఞానము మరియు అవగాహన పెంచడానికి మాత్రమే ఈ కథనం తయారు చేయబడింది. పై కథనంలో పేర్కొన్న సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.