Telugu Mirror : రియల్ మీ ఈరోజు ఇండియాలో రియల్ మీ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ పవర్ ఫుల్ కెమేరా మరియు డిస్ప్లేతో వచ్చింది. కేవలం ఈ రెండు వివరాలు మాత్రమే కాకుండా డిజైన్ తో సహా స్పెసిఫికేషన్స్ పరంగా ఆకట్టుకుంటోంది. గత కొంత కాలంగా రియల్ మీ టీజింగ్ చేస్తున్న ఈ ఫోన్ ను ఈరోజు 12:00 గంటలకు Amazonలో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Also Read : school holidays AndhraPradesh 2024: వేసవి సెలవులు ఎప్పటి నుండో తెలుసా? దాదాపు 50 రోజులు సెలవులు
మొదటిసారిగా, Realme Narzo 70 Pro 5G స్మార్ట్ ఫోన్ హారిజోన్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకా, ఈ ఫోన్‌లో రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంది. ఇది ఎయిర్ జెస్టర్ అనే అద్భుతమైన ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌లోని డిస్‌ప్లే 2000 నిట్‌ల బ్రైట్‌నెస్‌ని కలిగి ఉండడంతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లే తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 7S జనరేషన్ 2 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది Android 14 తో వస్తుంది.
ఈ ఫోన్‌లో సోనీ 50-మెగాపిక్సెల్ కెమెరా ను ఉపయోగించారు. 8GB RAM మరియు 256GB స్టోరేజ్ సామర్థ్యం తో ఈ ఫోన్ వస్తుంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. అలాగే 67 వాట్స్ సూపర్ వోక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ సామర్థ్యం తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
Also Read : Allu Arjun: ఆంధ్రాలో కూడా తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్..త్వరలోనే మల్టీప్లెక్స్ ప్రారంభం.
రియల్ మీ నార్జో 70 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 19,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 21,999 ధరతో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి బేసిక్ వేరియంట్ పైన రూ. 1,000 రూపాయలు మరియు హై ఎండ్ వేరియంట్ పైన రూ. 2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
అయితే, ఈరోజు సాయంత్రం 6 గంటకు జరగనున్న ఫస్ట్ సేల్ నుండి ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,999 విలువైన T300 ఇయర్ బడ్స్ ఉచితంగా అందుకోవచ్చని రియల్ మీ చెబుతోంది.