శామ్సంగా మజాకా.. దుమ్ము రేపుతున్న Samsung.. రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్ లు..

Telugu Mirror : శాంసంగ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఫిఫ్త్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం రికార్డ్ స్థాయిలో ప్రీ-బుకింగ్‌లను పొందినట్లు Samsung ప్రకటించింది. సామ్ సంగ్ కంపెనీ వెల్లడించిన ప్రకారం, మొదటి 28 గంటలలోనే 1,00,000 కంటే ఎక్కువ మంది కొనుగోలుదారులు Galaxy Z Flip 5 మరియు Z Fold 5 లను ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు .

భారత దేశంలో జూలై 27 నుండి Samsung Galaxy Z Flip 5 మరియు Galaxy Z Fold 5 స్మార్ట్ ఫోన్ ల కోసం ఫ్రీ బుకింగ్ లు ప్రారంభించబడ్డాయి. ఆగస్టు18, 2023 నుండి ఈ హ్యాండ్ సెట్ లు అమ్మకానికి లభిస్తాయి. Samsung Galaxy Z Flip 4 మరియు Z Fold 4, ఫోర్త్ జనరేషన్ ఫోల్డబుల్ లతో పోలిస్తే, ఇటీవలే మార్కెట్ లోకి వచ్చిన Samsung Galaxy ఫిఫ్త్ జనరేషన్ ఫోల్డబుల్స్ మొదటి 28 గంటల్లో Galaxy Z Flip 5 మరియు Z Fold 5 కోసం 1.7x ప్రీ-బుకింగ్‌లు నమోదు అయ్యాయి.

China Proposal : చిన్నారులకు ఇక స్మార్ట్ ఫోన్ వాడకం దూరం..’మైనర్ మోడ్’ ప్రపోసల్ తో చైనా…

Samsung Galaxy Z Flip 5 ధర
రూ.99,999 (8 GB + 256 GB) నుండి మొదలవుతుంది, అయితే 12GB RAM మరియు 256 GB ROM కలిగిన Galaxy Z Fold 5 రూ.1,54,999 నుండి లభిస్తుంది.  Galaxy Z Flip5ని ప్రీ-బుకింగ్ చేసుకునే కొనుగోలు దారులు రూ. 20,000 విలువైన లాభాన్ని అందుకుంటారు మరియు Galaxy Z Fold 5ని ప్రీ-బుకింగ్ చేసేవారు రూ. 23,000 బెనిఫిట్ పొందుతారు.

కొత్త ఫోల్డబుల్ హ్యాండ్ సెట్ లను అన్ని ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. కస్టమర్ లు శామ్‌సంగ్ లైవ్‌లో https://www.samsung.com/in/live-offers/ లో ప్రీ-బుక్ చేయవచ్చు .

Image credit: Cbs News

JB పార్క్ సామ్ సంగ్ నైరుతి (South West)ఆసియా ప్రెసిడెంట్ మరియు CEO మాట్లాడుతూ “ఇండియా లో మేము కొత్తగా లాంఛ్ చేసిన Galaxy Z Flip5 మరియు Galaxy Z Fold5 ఫోన్‌లకు విపరీతమైన స్పందన రావడంతో మేము ఆనందిస్తున్నాము. ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా మా వినియోగదారుల అవసరాలను తీర్చడంలో మా అంకిత భావాన్ని నూతన హ్యాండ్ సెట్ లు నిరూపణ చేస్తాయి.  Galaxy Z Flip5 మరియు Galaxy Z Fold5 యొక్క విజయం భారతీయ వినియోగదారులు నూతన ఆవిష్కరణల పట్ల అత్యంత వేగంగా ప్రతిస్పందన కలిగి ఉంటారని తెలియ జేస్తుంది. మా కొత్త హ్యాండ్ సెట్స్ ప్రధాన స్రవంతిలో ఉపయోగకరంగా ఉంటాయని. అలాగే భారతదేశంలో మా నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడంలో మాకు ఫోల్డబుల్స్ సహాయపడతాయని నాకు నమ్మకం ఉంది.” అని పేర్కన్నారు.

AP CM Jagan : జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఉచిత బస్ పాస్ సౌకర్యం..తోడుగా పెన్షన్ కానుక రూ.10000/-

Samsung Galaxy Z Flip 5 యొక్క ఫీచర్ లలో ఇప్పుడు బాహ్య స్క్రీన్ 3.78 రెట్లు పెద్దది మరియు గతం లో ఎన్నడూ లేనంత వినియోగాన్ని అందిస్తుంది.  Galaxy Z Flip 5 మరియు Galaxy Z Fold 5 రెండూ ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌లతో జోడించబడిన IPX8 రేటింగ్‌తో వస్తుంది. అదేవిధంగా Flex విండో మరియు బ్యాక్ కవర్ రెండిటికీ Corning Gorilla Glass Victus 2 ని అమలుపరిచారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in