Telugu Mirror : మిత్రులారా ! మార్కెట్ లో రోజు రోజుకి స్మార్ట్ వాచ్ (Smart Watch) లకు డిమాండ్ పెరిగిపోతుంది. స్మార్ట్ వాచ్ లోని అనేక కొత్త ఫీచర్లే ఇందుకు కారణం, మీ ఆరోగ్య సమాచారని ట్రాక్ చేయడంలో స్మార్ట్ వాచెస్ చాలా వరకు ఉపయోగపడతాయి. గుండెపోటు (Heart Attack) నుంచి స్మార్ట్ వాచ్ ప్రాణాలు కాపాడిన వార్తలు కూడా మనం గతంలో చాలా విన్నాం, అంతే కాకుండా మీ ఫోన్ను మీ జేబు నుండి తీయాల్సిన అవసరం కూడా లేకుండా కాల్ చేసుకోవడం వంటి సదుపాయం కూడ వినియోగదారులకి బాగా నచ్చింది. మీరు కూడా బడ్జెట్ రేంజ్లో ఇలాంటి ఫీచర్స్ తో ఉన్న స్మార్ట్ వాచ్లను కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మేము మీకు రూ.3,000 లోపు ఉన్న కొన్ని స్మార్ట్ వాచెస్ వివరాలని తీసుకొచ్చాం.
Noise Fit Endeavour (నాయిస్ ఫిట్ ఎండీవర్)
నాయిస్ ఫిట్ ఎండీవర్ వాచ్ ని కేవలం రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ లో 100+ స్పోర్ట్స్ మోడ్ స్మార్ట్ ఫీచర్లు మరియు స్లీప్ ట్రాకింగ్ (Sleep Tracking), బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (Blood Oxygen Monitor), 24×7 హార్ట్ రేటు మానిటర్, మహిళా సైకిల్ ట్రాకర్ (Women Cycle Tracker), స్లీప్ మానిటర్ (Sleep Monitor), ఎస్ఓఎస్ (SoS), బ్లూటూత్ కాలింగ్ (BlueTooth Calling),1.46 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, మీ రోజువారీ ఆరోగ్య స్థితిని చూసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఈ స్మార్ట్ వాచ్ ను అమేజాన్ (Amazon) నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు.
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ (Fire Bold Gladiator)
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ వాచ్ 1.96-inch HD displayతో మంచి విజువల్ అనుభూతిని ఇస్తుంది, గూగుల్/సిరి అసిస్టెంట్ వంటి సూపర్ ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్ ని రూ. 1,599కే Amazon.inలో పొందొచ్చు, ఎస్పీ02 మానిటర్, బ్లూటూత్ కాలింగ్ కొననెక్టివిటీ, 123 స్పోర్ట్స్ మోడ్ ఆప్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వాచ్ ఛార్జింగ్ 100 శాతానికి చేరుకోవాలంటే 3 గంటల సమయం పడుతుంది. అదే 20 శాతం ఛార్జింగ్ కోసం వాచ్ ను 25-35 నిమిషాలు పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 3.7 వి నుండి 5 వి అడాప్టర్ లేదా ఏదైనా ల్యాప్ టాప్ అవుట్ పుట్తో ఈ వాచ్ ని చార్జి చేయవచ్చు.
Also Read : Free 3GB Data: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కొన్ని రీఛార్జ్ ప్లాన్లకు అదనపు 3జీబీ డేటా బోనస్
boAt Xtend
ఈ స్మార్ట్ వాచ్లో ఇన్-బిల్ట్ అలెక్సా (In-Built Alexa), 100+ వాచ్ ఫేసెస్, బ్యాటరీ బ్యాక్ అప్ 7 రోజుల వరకు ఉంటుంది, స్ట్రెస్ మరియు హెల్త్ మానిటరింగ్ చేస్తుంది, SPO2 (రక్త, ఆక్సిజన్ స్థాయిలు) ను కూడా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం Amazon.in రూ .1,699 కు ఈ వాచ్ లభిస్తుంది.