Free 3GB Data: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కొన్ని రీఛార్జ్ ప్లాన్లకు అదనపు 3జీబీ డేటా బోనస్

బిఎస్ఎన్ఎల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్ లను ఎంపిక చేసింది, ఆ ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు రూ .251, రూ .299, రూ .398, రూ .666, రూ .499 మరియు రూ .599 రీఛార్జ్ చేసుకునట్లయితే మీకు ఉచిత 3 జీబీ బోనస్ డేటా లభిస్తుంది

Telugu Mirror : మీరు బిఎస్ఎన్ఎల్ టెలికాం సర్విస్ (Telecom Services) ని వాడుతున్నట్లయితే ఈ శుభ వార్త మీ కోసమే. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఇప్పటి నుంచి మీరు బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ పైన అదనపు డేటాను పొందవచ్చు. ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

అదనపు డేటాను ఎలా పొందాలి?

BSNL అధికారిక పోర్టల్ మరియు సెల్ఫ్-కేర్ యాప్‌ (BSNL Selfcare App) ని ఉపయోగించి నంబర్ రీఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే అదనపు డేటా అందుబాటులో ఉంటుంది. BSNL రూ.251 రీఛార్జ్ తో అదనంగా 3GB డేటాను ప్రకటించింది. ఇది జింగ్ మ్యూజిక్ (zing music) ప్లాన్‌తో పాటు చేర్చబడిన 70GB డేటా కన్నా ఎక్కువ వస్తుంది. రూ. 252 రీఛార్జ్ ప్లాన్ 28 రోజులకు మాత్రమే వర్తిస్తుంది, ఆ తర్వాత అదనపు డేటా గడువు ముగుస్తుంది.

BSNL తమ నెట్‌వర్క్‌ను రూ.299 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు అదనంగా 3GB ఉచిత డేటాను ప్రకటించింది. BSNL సెల్ఫ్-కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయడం ద్వారా మాత్రమే అదనపు డేటాను పొందవచ్చు. ఈ ప్యాకేజీలో ఇప్పటికే రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలు మరియు 30 రోజుల పాటు అపరిమిత స్థానిక మరియు STD వాయిస్ కాలింగ్ ఉన్నాయి.

 

Good news for BSNL users. Additional 3GB data bonus for some recharge plans
image credit : KeralaTelecom.info

Also Read:Smart Phones Under 7000: స్మార్ట్ గా కనిపించే స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు సరసమైన ధరల్లో అందుబాటులోకి , ధర, ఫీచర్లు  ఏంటో తెలుసా?

బిఎస్ఎన్ఎల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్ లను ఎంపిక చేసింది, ఆ ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు రూ .251, రూ .299, రూ .398, రూ .666, రూ .499 మరియు రూ .599 రీఛార్జ్ చేసుకునట్లయితే మీకు ఉచిత 3 జీబీ బోనస్ (3 GB Bonus) డేటా లభిస్తుంది. డేటా వోచర్ ఈ ప్లాన్ లో ఒకటి కాబట్టి ప్రీపెయిడ్ వోచర్లన్ని సర్వీస్ చెల్లిబాటును అందించవు.

ఇక్కడ మీరు కేవలం బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ తోనే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మరి ఏ ఇతర పద్దితిలోనూ ఇది వర్తించదు, అంటే మీకు బోనస్ డేటా లభించదని అర్ధం.

అంతే కాకుండా ఈ ఆఫర్ వేరొక పద్దతిలో కూడా మీరు పొందవచ్చు, పాత 2జీ/3జీ సిమ్లను 4జీ సిమ్లకు అప్గ్రేడ్ చేసుకుంటే కస్టమర్లకు ఉచిత డేటాను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ కు అప్గ్రేడ్ అయిన యూజర్లకు 4 జీబీ డేటా లభిస్తుంది. తమ సిమ్ కార్డును అప్ గ్రేడ్ చేయడానికి, వినియోగదారులు సమీప బిఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని లేదా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విక్రయించడానికి అధికార సిమ్ రిటైలర్ను సంప్రదించవచ్చు. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశం అంతటా 1 లక్ష సైట్లలో 4 జిని ప్రారంభించడానికి పనిచేస్తోంది.

Comments are closed.