Telugu Mirror : చక్కెరను (sugar) అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హానికరం అని పరిగణించబడుతుంది. దీని వినియోగం ఎక్కువైతే రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాకుండా బరువు పెరగడంతో పాటు జీవక్రియ ఆరోగ్యం మీద మరియు గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చక్కెరను తగు మోతాదులో మాత్రమే వినియోగించాలని ఆరోగ్య నిపుణులుక చెబుతున్నారు లేదా చక్కెర వాడకాన్ని పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి చాలా ఉత్తమం అని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
కొంతమందికి తీపి పదార్థాలు (Sweets) తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. స్వీట్లు తినే అలవాటును వదిలేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఆ అలవాటు మానుకోలేని వారు చక్కరకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం బెల్లం. చక్కెరకు బదులుగా బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, బెల్లం (Jaggery) తీపి రుచిని అందించడమే కాకుండా అనేక రకాల ఆరోగ్యకరమైన ఉపయోగాలను కూడా కలిగి ఉందని నిపుణులు పేర్కొన్నారు.
Also Read :హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేపించుకోవాలని అనుకుంటున్నారా, పూర్తి అవగాహన తెచ్చుకోండిలా
ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం మంచి ఎంపిక అని పరిశోధకులు వెల్లడించారు. 2015 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం శుద్ధి చేసిన తెల్లటి పంచదార కంటే బెల్లం మరింత పోషకమైన ఎంపిక గా చెప్పవచ్చు.బెల్లం తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ మరియు పొటాషియం వంటి వాటిని కూడా శరీరానికి అందిస్తుంది. ఇదే కాకుండా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించవచ్చు.
డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు బెల్లం తినొచ్చా లేదా అనేది చాలా మందికి చాలా కాలంగా ఉన్న ప్రశ్న .అయితే చక్కెర కంటే బెల్లం తీసుకోవడం మంచిదని, మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు . చక్కెర తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు బెల్లం తినడం వల్ల రావు. బెల్లం తినడం వల్ల జీర్ణ క్రియ మరియు రోగ నిరోధక శక్తి సక్రమంగా పనిచేయడానికి చాలా బాగా దోహదపడుతుంది. బెల్లం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ (84)ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
బెల్లం తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల మలబద్దకు సమస్యను నివారించడంలో మంచి ఎంపికగా చెప్పవచ్చు.
Also Read : ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ – పాకిస్తాన్‌పై 228 పరుగులతో భారత్ విజయం.
భారతీయ ఆహార సంప్రదాయం ప్రకారం భోజనం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చిన్న బెల్లం ముక్క తినాలని సూచించారు.
బెల్లం తినడం వల్ల రక్తహీనతను (Anemia) కూడా నివారించడంలో తోడ్పడుతుంది. రక్తహీనత మహిళలలో అధికంగా ఉండే సమస్య. కాబట్టి రక్తహీనత ఉన్నవారు బెల్లం తినడం వల్ల ఆ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 100 గ్రాముల బెల్లం లో సుమారుగా 11 మిల్లి గ్రాముల ఐరన్ కలిగి ఉంటుంది.
అయితే బెల్లంను కూడా అధిక మోతాదులో మాత్రం తినకూడదని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. బెల్లం తినడం వల్ల శరీరానికి ఇనుముతో పాటు అనేక రకాలు ఇతర పోషక విలువలను అందించడంలో తోడ్పడుతుంది. కాబట్టి బెల్లం తినడం ఆరోగ్యానికి మంచి ఎంపిక.
కాబట్టి చెక్కర వినియోగం కన్నా బెల్లం తీసుకోవడం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…