BHIM Cash Back News: భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్, రూ. 750 క్యాష్ బ్యాక్ ఇస్తున్న BHIM యాప్, ఆ వివరాలు మీ కోసం

భీమ్ యాప్ ద్వారా రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ పొందచ్చు. ఫుడ్ ఆర్డర్లకు, ట్రావెలింగ్ ఖర్చుల కోసం ఈ యాప్ ను వాడడం ద్వారా రూ. 150 క్యాష్ బ్యాక్ వస్తది. దీని కోసం వినియోగదారులు 100 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది.

BHIM Cash Back News :  ఇప్పుడున్న సమాజంలో ఎవరి చేతిలో డబ్బులండటం లేదు. యూపీఐ యాప్ లలోనే డబ్బులుంటున్నాయి. దీంతో కూరగాయలు కొనాలన్న, జ్యూస్ తాగాలన్న, ఇంకా పెద్ద పెద్ద వస్తువులు ఏవి కొన్నా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అయితే యూపీఐ యాప్ లు క్యాష్ ఆఫర్ ఇస్తే బాగుండని మనకు అనిపిస్తుంది. మనకోసం క్యాష్ బ్యాక్ ఇవ్వటానికి BHIM యాప్ రెడీగా ఉన్నది. దీని ద్వారా ట్రాన్సక్షన్స్ చేస్తే భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకొచ్చు.

ఆ వివరాలు మీ కోసం..

భీమ్ యాప్ ద్వారా రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ పొందచ్చు. ఫుడ్ ఆర్డర్లకు, ట్రావెలింగ్ ఖర్చుల కోసం ఈ యాప్ ను వాడడం ద్వారా రూ. 150 క్యాష్ బ్యాక్ వస్తది. దీని కోసం వినియోగదారులు 100 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో రూ. 30 బ్యాక్ వస్తుంది. యూజర్లు 150 పొందేందుకు ఐదు సార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు.

రూపే క్రెడిట్ కార్డును భీమ్ యాప్ కు లింక్ చేసి ఉంటే రూ. 600 క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు. 100 కంటే ఎక్కువ మొత్తంతో జరిపే మొదటి మూడు లావాదేవీలపై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత ప్రతి నెలా రూ. 200 దాటిన 10 ట్రాన్సాక్షన్స్ పై అదనంగా రూ. 30 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఈ ట్రాన్సాక్షన్లను పూర్తి చేస్తే మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అదే విధంగా భీమ్ యాప్ ఉర్జా 1శాతం స్కీమ్ ద్వారా 1 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. భీమ్ యాప్ అందించే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

భీమ్ యాప్ అన్ని ఫ్యూయల్, యుటిలిటీ బిల్లు పేమెంట్స్‌పై 1% క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిసిటీ, వాటర్‌, గ్యాస్ బిల్లులపై 1% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ.100 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపుపై ఈ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

రోజు మనం ఏదో ఒక యూపీఐ యాప్ ద్వార మనీ ట్రాన్సఫర్ చేస్తాం. ఆ యాప్ ల ద్వారా ఎలాంటి మనీ బ్యాక్ రాదు. ఇదే సమయంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వటానికి BHIM యాప్ ఉన్నది. కాబట్టి వినియోగదారులు ఈ యాప్ ను ఉపయోగించి లబ్ధి పొందగలరు. ఈ సందర్భంగా ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు, మనీ ట్రాన్సక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహించగలరు.

Comments are closed.