భారత దేశ లాభాల గురించి సీఈఓ టిమ్ కుక్ ఆనందం, ఐఫోన్ 17 మొదటి ఉత్పత్తి భారత్ లోనే

భారతదేశంలో రూ. 45,000 కంటే ఎక్కువ అమ్ముడవుతున్న మొత్తం సెల్‌ఫోన్‌లలో సగానికి పైగా ఐఫోన్‌లే ఉన్నాయి. గత 12 నెలల్లో యాపిల్ సంవత్సరానికి 56% వృద్ధిని సాధించింది.

Telugu Mirror : చైనా (Chaina) తన మొబైల్ తయారీ, ఆ దేశంలో ఉన్న పెద్ద మార్కెట్ల గురించి గొప్పగా చెప్పుకొస్తుంది. దీన్నే ఆయుధంగా చేసుకుని దాదాపు పదేళ్లుగా మిగిలిన ప్రపంచాన్ని చైనా బెదిరిస్తోంది. తక్కువ ధరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం మరే ఇతర దేశానికి లేదని చైనా  ప్రచారం చేయడం వల్ల చైనా దేశంపై నమ్మకం పెరిగింది. ఇంకా, మొబైల్ ఫోన్‌ల విక్రయానికి ఇంత పరిమాణంలో మరెక్కడా మార్కెట్ లేదు. హై-ఎండ్ మరియు అత్యంత హై-ఎండ్ హ్యాండ్‌సెట్‌లకు భారత మార్కెట్ సరిపోదని చైనా పేర్కొంది. అటువంటి సమయంలో ఆపిల్ చైనా వైపు చూడవలసి వచ్చింది. కానీ అక్కడ  చైనా చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తుంది.

Mukesh Ambani Death Threat : తెలంగాణ, గుజరాత్ కి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు. డబ్బు ఇవ్వకుంటే చంపుతామని అంబానీకి ఇమెయిల్ బెదిరింపులు

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) ప్రకారం, యాపిల్ భారతదేశంలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లలో అగ్రగామిగా ఉంది. రూ. 40,000 లేదా అంతకంటే ఎక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు భారతీయుల మొదటి ప్రాధాన్యత ఆపిల్ అని రీసెర్చ్ పేర్కొంది. ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో ఖరీదైన సెల్‌ఫోన్‌ల ఎంపిక పెరిగింది. భారతదేశంలో, రూ. 45,000 కంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను కొనాలనుకుంటే  దాంట్లోఆపిల్ మాత్రమే 59 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, భారతదేశంలో రూ. 45,000 కంటే ఎక్కువ అమ్ముడవుతున్న మొత్తం సెల్‌ఫోన్‌లలో సగానికి పైగా ఐఫోన్‌లే ఉన్నాయి. గత 12 నెలల్లో యాపిల్ సంవత్సరానికి 56% వృద్ధిని సాధించింది.

Image Credit : Hindusthan Times

భారత్ లో యాపిల్ డిమాండ్ 

ఆపిల్ భారతదేశంలో గణనీయంగా ఆదాయాన్ని ఆర్జించింది. ఆల్ టైమ్ హై రెవిన్యూ రికార్డ్‌తో, యాపిల్ ఈ సంవత్సరం భారతదేశంలో అత్యధిక డబ్బు సంపాదించింది. ఈ ఏడాది భారత్‌లో చైనా ఆదాయం 43.8 బిలియన్ డాలర్లు, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 3% పెరిగింది. భారత మార్కెట్‌లో యాపిల్‌కు చాలా అవకాశాలు ఉన్నాయని టిమ్ కుక్ పేర్కొన్నారు. అన్ని వేళలా భారత్‌పై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. తయారీ, విక్రయాలు రెండింటిలోనూ చైనా ఆధిపత్యాన్ని భారత్ బద్దలు కొట్టిందని యాపిల్ అంగీకరించింది. దీనికి సంబంధించి, యాపిల్ సిఐ టిమ్ కుక్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు.

Holidays in Delhi : దేశ రాజధానిలో వాయు కాలుష్యం, నవంబర్ 10 వరకు పాఠశాలలు మూసివేత

చైనాకి తయారీ రంగంలో సవాలు 

ఐఫోన్లు మరియు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తి విషయానికి వస్తే, భారతదేశం చైనాతో పోటీ పడుతోంది. మొబైల్ వ్యాపారాల సంఖ్య భారతదేశంలోకి విస్తరించడం వెనుక ఉన్న కారణం ఇదే. టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి విస్ట్రాన్ కంపెనీని కొనుగోలు చేసింది. చైనా కంటే ముందు భారత్ ఐఫోన్ 17ను ఉత్పత్తి చేస్తుంది.

Comments are closed.