Cinema Download : సినిమా డౌన్లోడ్ చేసే సమయంలో మోసగాళ్ళ వలలో పడకండి

Telugu Mirror: ప్రస్తుత రోజుల్లో దాదాపుగా ప్రతి పనినీ దాన్ని చేసే విధానం, పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఇదంతా టెక్నాలజీ (Technology) వల్ల జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణకు గతంలో సినిమా చూడాలంటే అందరూ ధియేటర్ కి వెళ్లి చూసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. ఇప్పుడున్న వెబ్ సైట్ (WebSites) లు సినిమా విడుదలైన ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రజలకు ఫ్రీగా చూపించే వెబ్ సైట్ లు వచ్చేసాయి. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. థియేటర్ (Theater) కి వెళ్లి డబ్బును వృధా చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ (SmartPhone) దాదాపుగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కాబట్టి ఫ్రీ వెబ్ సైట్ ల ద్వారా సినిమాలను డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం ఎంతవరకు సురక్షితం? మోసగాళ్లు సినిమాల ముసుగులో మన పూర్త సమాచారంను ఉచితంగా దోచుకుంటున్నారా ? అవును దోచుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. కాబట్టి మూవీని డౌన్లోడ్ చేసేటప్పుడు మనం ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. దీంతో మనం మోసగాళ్లు చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడదాం.

Image Credit: The Indian Express
Also Read:SBI Loan: కస్టమర్లకు శుభవార్త లోన్ రికవరీల మీద SBI నిషేధం, ఎవరికి వర్తిస్తుంది?

1. మూవీని డౌన్లోడ్ చేసేటప్పుడు లింక్ పై క్లిక్ చేస్తాం. అలాంటి సందర్భంలో చాలా లింకులు ఏపీకే యాప్ ను ఇన్ స్టాల్ చేయమని చెప్తుంది. అటువంటి సందర్భంలో గుర్తించుకోండి ఈ ఏపీకే యాప్ (APK APP) ఇన్ స్టాల్ చేయకూడదని. ఎందుకనగా ఇది ఏపీకే రూపంలో వైరస్ అయ్యే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత డేటాను దొంగలించే అవకాశం ఉంది.

2. లింక్ ద్వారా సినిమా డౌన్లోడ్ చేసినప్పుడు వివిధ రకాల వెబ్ సైట్ లేదా యాప్ లోకేషన్, కెమెరా స్టోరేజ్ వంటి ఇతర అనుమతులను అడుగుతాయని గుర్తించుకోవాలి. అటువంటి అప్పుడు ఏదైనా వెబ్ సైట్ మిమ్మల్ని మీ బ్యాంక్ డీటెయిల్స్ లేదా మీ మొబైల్ యొక్క లొకేషన్ కోసం అనుమతి అడిగితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా ఈ వెబ్ సైట్ మోసపూరితమైనది కావచ్చు. అలాగే మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

3. మూవీని వెంటనే ఉచితంగా డౌన్లోడ్ (Download) చేసుకొని చూడాలన్న ఉద్దేశంతో లింక్ ల కోసం వెతుకుతుంటారు. అటువంటి అప్పుడు తెలియని లింకులపై క్లిక్ చేయడం వలన మీరు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని మోసం చేసే లింక్ లు. వీటిని మోసగాళ్లు క్రియేట్ చేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.కాబట్టి మీరు సోషల్ మీడియా (Social Media) లో వచ్చిన మెసేజెస్ లేదా తెలియని గ్రూపులో కలుసుకున్నటువంటి లింక్ ల ద్వారా మూవీ డౌన్లోడ్ చేయకండి. ఎందుకనగా మీరు చేసే ఈ చిన్న పొరపాటు వల్ల బ్యాంకు ఖాతాలో ఉన్న మరియు కష్టపడి సంపాదించిన సొమ్మును రెప్పపాటులో ఖాళీ చేస్తాయని గుర్తించుకోండి.

Leave A Reply

Your email address will not be published.