Flipkart : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో 16 శాతం డిస్కౌంట్ తో ఐఫోన్ 15 మీ సొంతం

ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆఫర్స్ లో ఐఫోన్ 15 పై ఏకంగా 16% డిస్కౌంట్ లభిస్తుంది. పండగ సీజన్లో ఐఫోన్ కొనాలనే ఉద్దేశం ఉన్నవారు ఇప్పుడే కొనుగోలు చేయండి.

Telugu Mirror : మీకు ఐఫోన్ అంటే ఇష్టమా, ఐఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా లేదా మీ పాత ఫోన్ తీసేసి కొత్త ఫోన్ కొందామని చూస్తున్నారా, అయితే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అందిస్తున్న ఆఫర్ ని ఉపయోగించుకొని మీరు ఐఫోన్ 15 (Iphone 15) ని సొంతం చేసుకోవచ్చు, ఐఫోన్ 15 మోడల్ మీద ఫ్లిప్కార్ట్ ఏకంగా 16% డిస్కౌంట్ ఇస్తుంది.

ఐఫోన్ 15 128 GB అసలు ధర రూ.79, 900, 16% డిస్కౌంట్ తో రూ.66,999 కే లభిస్తుంది, అదే విధంగా 256GB అసలు ధర రూ.76999 కాని ఈ వేరియెంట్ కి 14% డిస్కౌంట్ మాత్రమే ఉంది, చివరిగా 512GB రూ.1,09,900 నుంచి 11% డిస్కౌంట్ తో రూ.96999 కే లభిస్తుంది.

ఒకవేళ మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Credit Card) మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ (Bank Of Baroda Credit Card) ఉన్నట్లయితే మరో 10% వరుకు తగ్గింపుని పొందవచ్చు.

ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఎక్స్చేంజ్ ఆప్షన్ (Exchange Option) కూడా మనకి లభిస్తుంది, కాకపోతే అది మీ పిన్ కోడ్ (Pin Code) మీద ఆధారపడి ఉంటుంది, మీ పిన్ కోడ్ కి ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందా లేదా అనేది మీరు ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సుమారు 54 వేల వరకు తగ్గింపును మనం ఎక్స్చేంజి లో పొందవచ్చు.

Good news for iPhone lovers, own iPhone 15 with 16 percent discount in Flipkart republic day sale
image credit : easycep

Also Read:శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా హ్యాండ్-ఆన్ వీడియో లీక్డ్, లాంచ్ తేదీ ఎప్పుడో తెలుసా?

ఇంకా మొబైల్ విషయానికి వస్తే బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో ఇలా మొత్తం ఐదు రంగులో మనకి ఐఫోన్ 15 లభిస్తుంది. Apple iPhone 15 లో డ్యూయల్-సిమ్ (GSM) కార్డ్ లని ఉపయోగించవచ్చు, కానీ ఈ డివైస్ నానో-SIM కార్డ్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. Apple iPhone 15 బరువు వచ్చేసి 171.00 గ్రాములు మరియు కొలతలు 147.60 x 71.60 x 7.80mm (ఎత్తు x వెడల్పు x మందం).

ఐఫోన్ 15 60 Hz రిఫ్రెష్ రేట్ (Refresh Rate) తో 6.10-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది, Apple iPhone 15 6GB RAM తో పాటు, హెక్సా-కోర్ Apple A16 బయోనిక్ ప్రాసెసర్‌ (Apple A16 Bionic Processor) తో పనిచేస్తుంది, అదే విధంగా 460 పిక్సెల్‌ల డెన్సిటీ (ppi) వద్ద 1179×2556 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది, వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఆప్షన్ కూడా ఈ మొబైలులో ఉంది.

కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు ఉన్న Apple iPhone 15 48-megapixel (f/1.6) ప్రైమరీ కెమెరా మరియు ఫ్రంట్ కెమెరా 12-megapixel (f/2.4) ని కలిగి ఉంటుంది. ఇది సెల్ఫీలు, వీడియో కోసం ఎక్కువగా ఉపయోగించవచ్చు, ఇందులో f/1.9 ఎపర్చర్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.

Apple iPhone 15లోని కనెక్టివిటీ ఫీచర్స్ (Connectivity Features) చూసినట్లు అయితే GPS, బ్లూటూత్ v5.30, Wi-Fi 802.11 b/g/n/ac/ax, USB టైప్-C, NFC, 3G, 4G ఉన్నాయి. భారతదేశంలో రెండు SIM కార్డ్‌లలో యాక్టివ్ 4G, 5G సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైలులో అనేక సెన్సార్‌లు కలిగి ఉన్నాయి గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, బేరోమీటర్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

Comments are closed.