Jio Republic Day Offer : జియో యూజర్లకు గుడ్ న్యూస్, రూ.2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పై బోలెడు ప్రయోజనాలు

వార్షిక ప్రీపెయిడ్ రూ.2,999 రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఫ్యాషన్ రెటైర్ల అప్లికేషన్స్ పై డిస్కౌంట్ల కూపన్లు పొందవచ్చు.

Telugu Mirror : జియో యూజర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్, రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ప్రముఖ దిగ్గజం రిలయన్స్ జియో ఇప్పుడు జియో ప్రీపెయిడ్ రూ.2,999 రీఛార్జ్ ప్లాన్ తో అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. వార్షిక ప్రీపెయిడ్ రూ.2,999 రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఫ్యాషన్ రెటైర్ల అప్లికేషన్స్ పై డిస్కౌంట్ల కూపన్లు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లు లిమిటెడ్ టైంలోనే వర్తిస్తాయి. ప్రీపెయిడ్ కాల్స్, మరియు ఇతర అన్ని సాధారణ ప్రయోజనాలు అందిస్తున్నాయి.

ajio,tira మరియు Ixigo వెబ్సైట్ల నుండి  కూపన్స్ :

రూ.2,999 ప్రీపెయిడ్ రీఛార్జ్ పై నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ మరి కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ajio,tira మరియు Ixigo వెబ్సైట్ల లో కూపన్స్ పొందవచ్చు. అజియో లో రూ.2,499 కనీస ప్లాన్ పై రూ.500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

good-news-for-jio-users-lots-of-benefits-on-rs-2999-prepaid-recharge-plan
Image Credit : 91 mobiles

Also Read : Flipkart : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ లో 16 శాతం డిస్కౌంట్ తో ఐఫోన్ 15 మీ సొంతం

తీరా కస్టమర్లు 30% వరకు డిస్కౌంట్స్ అందుకుంటారు. అదే ఇక్సిగో వినియోగదాలు ఫ్లైట్ టికెట్స్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక స్విగ్గీలో కూడా రూ.250 కూపన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.125 రెండు కూపన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు రూ.5,000 కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ ని అందిస్తున్నారు.

అన్ని పార్టనల్ కూపన్లు గడువు తేదీకి ముందే రిడీమ్ చేసుకోవచ్చు. రూ.2,999 రీఛార్జ్ ప్లాన్ తో వెబ్సైటు లో డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్ కోడ్స్ ని పొందవచ్చు. అయితే ప్రతి కూపన్ వాలిడిటీకి సంబంధించిన పూర్తి వివరాలు మైజియో యాప్ లో లింక్డ్ ఎఫ్ఎక్యు డాకుమెంట్స్ లో ఉంటాయని జియో పేర్కొన్నది. ప్రస్తుతం ఈ ఆఫర్ జనవరి 15 నుండి జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది. జియో ఆఫర్ పొందేందుకు మీకు ఇంకా రెండు వారాల గడువు ఉంది.

రూ.2,999 వార్షిక ప్లాన్ : 

జియో అందిస్తున్న రూ.2,999 వార్షిక ప్లాన్ ద్వారా అపరిమితమైన వాయిస్ కాల్స్, అపరిమితమైన 5G డేటాని పొందవచ్చు. 4G డేటా అయితే రోజుకి 2.5GB ని పొందుతారు. రోజుకి 100 SMS లు పంపవచ్చు. రూ.2,999 ప్లాన్ 365 రోజుల వాలిడిటీ ని అందిస్తుంది. జియో సినిమా సబ్స్క్రిప్షన్ లేదు కానీ జియో టీవీ, జియో సినిమా మరియు జియోక్లౌడ్ యాక్సిస్ ను పొందవచ్చు. ఈ ఆఫర్స్ కేలవం రూ.2,999 రీఛార్జ్ ప్లాన్ పై మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Comments are closed.