Google Pay Stops Working: గూగుల్ పే ఇక పని చేయదు, అసలు కారణం ఇదేనా!

గతంలో "స్వతంత్ర యాప్"గా ఉన్న Google Pay యాప్ యొక్క US వెర్షన్ ఇకపై జూన్ 4, 2024 నుండి వినియోగానికి అందుబాటులో ఉండదు. కారణం ఇదే.

Google Pay Stops Working: మనం తరచుగా యూపీఐ లావాదేవీ (UPI Transactions) లు చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్లిన ఏ పని చేసిన యూపీఐ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్నాం. అయితే, తరచుగా వాడే యూపీఐ యాప్స్ లో గూగుల్ పే ఒకటి. భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో Google Payని అధిక సంఖ్యలో ఉపయోగిస్తారు.

గూగుల్ పే యాప్ ని ఉపయోగించి, డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే షాపింగ్ చేస్తున్నప్పుడు స్టోర్‌లోని చిన్న వస్తువులను స్కాన్ చేసి చెల్లించడం వంటివి చేస్తారు. అయితే, జూన్ 4 నుండి అనేక దేశాల్లో Google Pay సేవలను గూగుల్ నిలిపివేస్తుంది.

గతంలో “స్వతంత్ర యాప్”గా ఉన్న Google Pay యాప్ యొక్క US వెర్షన్ ఇకపై జూన్ 4, 2024 నుండి వినియోగానికి అందుబాటులో ఉండదు. వర్చువల్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు, టిక్కెట్లు, పాస్‌లు మరియు ట్యాప్-టు-పేతో సహా Google Wallet యాప్‌కి మారాలని ఇప్పటికే ఉన్న Google Pay వినియోగదారులకు కంపెనీ చెప్పుకొచ్చింది.

2022లో అమెరికాలో Google Wallet ప్రారంభించినప్పటి నుండి, ‘జీపే ‘(GPay) యాప్ వినియోగం తగ్గింది. యునైటెడ్ స్టేట్స్‌లో Google Pay యాప్ కంటే Google Wallet ఐదు రెట్లు ఎక్కువగా ఉపయోగంలో ఉంది.

Google Pay Banned In USA
Also Read:New Jio Finance App: ఇకపై అన్నీ ఒకే చోట, జియో నుండి సరికొత్త యాప్ ఇదే!

ఆ క్రమంలో, Google Wallet వినియోగదారులందరికీ డిఫాల్ట్ ఆప్షన్ గా మారింది. దీంతో అమెరికాలో పాత Google Pay యాప్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. దీని అర్థం పాత వర్షన్ ఇకపై పనిచేయదు. ఆండ్రాయిడ్ హోమ్‌స్క్రీన్‌లో చూడగలిగే, చెల్లింపులు మరియు ఫైనాన్సింగ్ కోసం ఉపయోగించే ‘GPay’ యాప్ అప్‌డేట్ చేశారు. అయితే, భారత్ మరియు సింగపూర్‌ (Singapore) లోని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో గూగుల్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేస్తూనే ఉంటుంది. ఈ యాప్ ఇకపై అమెరికాలోని వినియోగదారులకు పని చేయదు. ఇంకా, Google పీర్-టు-పీర్ చెల్లింపులను నిలిపివేసింది.

Comments are closed.