New Jio Finance App: ఇకపై అన్నీ ఒకే చోట, జియో నుండి సరికొత్త యాప్ ఇదే!

Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ UPI మరియు డిజిటల్ బ్యాంకింగ్‌కు మద్దతు ఇచ్చే 'JioFinance' యాప్ యొక్క బీటా వెర్షన్‌ను ప్రకటించింది.

New Jio Finance App: టెలికాం టాప్ ఇండస్ట్రీలో రిలయన్స్ జియో (Reliance Jio)ఒకటి. జియో ప్రతి ఒక్కరికీ సరసమైన ధరలో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెస్తూ టాప్ లో నిలుస్తుంది. ప్రస్తుతం, ఇది దేశంలోనే అగ్రగామి నెట్‌వర్క్‌గా కొనసాగుతోంది. జియోకు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. అయితే, ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (Jio Financial Services Limited) జియో ఫైనాన్స్ యాప్‌ (Jio Finance App) ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్‌ను బీటాలో విడుదల చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries) యొక్క విభాగమైన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తన జియో ఫైనాన్స్ యాప్ అత్యాధునిక వేదిక అని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ యాప్ వ్యక్తిగత ఫైనాన్స్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking) రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది.

‘JioFinance’ యాప్ :

Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ UPI మరియు డిజిటల్ బ్యాంకింగ్‌ (Digital Banking) కు మద్దతు ఇచ్చే ‘JioFinance’ యాప్ యొక్క బీటా వెర్షన్‌ను ప్రకటించింది. యాప్‌లో డిజిటల్ బ్యాంకింగ్, UPI లావాదేవీలు, బిల్లు సెటిల్లింగ్ వంటి వాటిల్లో సహాయపడుతుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌లో ఖాతాలు మరియు పొదుపుల యొక్క వీక్షణను అందిస్తుందని అని JioFinance పేర్కొంది.

“లెండింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, పేమెంట్‌లు మరియు లావాదేవీల వంటివి అందించడంలో అంతిమ లక్ష్యం ఏమిటంటే, ఏ యూజర్‌కైనా ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని సులభతరం చేయడం మరియు ఆర్థిక సేవలను మరింత సరసమైన మరియు స్పష్టమైనదిగా చేయడమే లక్ష్యం అని కంపెనీ పేర్కొంది.

Also Read:Reliance Home Delivery: క్విక్ కామర్స్ లోకి రిలయన్స్, ఇక అర్దగంటలో మీ ఇంటికి డెలివరీ

జియో ఫైనాన్స్  యాప్ (JIO Finance App) ప్రత్యేకత ఏమిటి?

జియో ఫైనాన్స్ యాప్ డిజిటల్ బ్యాంకింగ్, యుపిఐ లావాదేవీలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ (Claim Settlement) మరియు ఇన్సూరెన్స్ కన్సల్టింగ్‌ (Insurance Consluting) లకు సహాయం చేస్తుంది. జియో వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ యాప్‌ను మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని జియో ఫైనాన్స్ ప్రతినిధి తెలిపారు. వినియోగదారులు తమ ఆర్థిక నిర్వహణ విధానాన్ని సెట్ చేయడంలో సహాయపడటమే ఈ యాప్ యొక్క లక్ష్యమని. అంతే కాకుండా, కస్టమర్‌లు అన్ని ఆర్థిక సేవలను ఒకే ఇంటర్‌ఫేస్ ద్వారా యాక్సెస్ చేయగలరని మేము కోరుకుంటున్నాము అని అయన పేర్కొన్నారు.

Comments are closed.