Indian Budget Cars : మార్కెట్‌ను ఊపేస్తున్న బడ్జెట్‌ కార్స్‌.. త​క్కువ ధరకే సూపర్‌ ఫీచర్లు..!

భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది బడ్జెట్ కార్లను ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.12 లక్షల లోపు అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Indian Budget Cars : ఇటీవలి కాలం లో భారతదేశంలో కార్ల కొనుగోలుదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణం గా ఒక సొంత కార్ ఉండాలి అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్ల విక్రయాలు చాలా వరకు పెరిగాయి. అయితే భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా చాలా మంది బడ్జెట్ కార్లను ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో రూ.12 లక్షల లోపు అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

Maruti Suzuki Brezza :

indian-budget-cars
మారుతి సుజుకి బ్రెజ్జా ఒక సబ్ కాంపాక్ట్ SUV. ఈ ఆటోమొబైల్‌కు రెండు గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఒకటి 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. మారుతి సుజుకి బ్రెజ్జాలో మీకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి. చవకైన మరియు దీర్ఘకాలం ఉండే బ్రెజ్జా భారతీయ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంది, దీని ధరలు రూ. 8.34 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Maruti Suzuki Toyota :

indian-budget-cars
మారుతి సుజుకి టయోటా గ్లాంజా ఇటీవల ప్రజాదరణ పొందింది. ఈ ఆటోమొబైల్ 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే ఈ కారులో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంటుంది. గ్లాంజా అధునాతన ఫీచర్లతో మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఈ కారు ధర రూ. 6.86 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Hyundai Venue :

indian-budget-cars
హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ SUV. ఇది వివిధ రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ ఆటోమొబైల్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. ఈ ఆటోమొబైల్ నడపదానికి చాలా వీలుగా ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ డీజిల్ ప్రారంభ ధర రూ. 10.70 లక్షలుగా ఉంది.

Hyundai City I-V :

indian-budget-cars
హ్యుందాయ్ సిటీ i-V టెక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ వాహనంలో ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ అమర్చవచ్చు. ఈ సెగ్మెంట్లోని అత్యంత సౌకర్యవంతమైన, అత్యుత్తమ హ్యాండ్లింగ్ కార్లలో సిటీ కూడా ఒకటి. హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.74 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Comments are closed.