Iphone 17 Slim Update: ఐఫొన్ 17 స్లిమ్ లాంచ్ ఎప్పుడో తెలుసా? అత్యంత ఖరీదయిన ఫోన్ ఇదే!

2025లో యాపిల్ రాబోయే ఫోన్‌లలో ఐఫోన్ 17 స్లిమ్ అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. లాంచ్ ఎప్పుడంటే?

Iphone 17 Slim Update: ఐఫోన్ అంటే అందరూ ఇష్టపడతారు. ఐఫోన్ కి సంభందించి కొత్త కొత్త అప్డేట్స్ ఏమున్నాయి అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు. అయితే, ఐఫోన్ 17 సిరీస్ పై అప్డేట్ (iphone 17 slim update) వచ్చింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫోన్ 17 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. గత కొన్ని సంవత్సరాలలో, యాపిల్ నాలుగు మోడళ్లను నిర్ణీత ధరతో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇటీవల విడుదలైన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌లు ఉన్నాయి. ఐఫోన్ 17 స్లిమ్ ఆపిల్ యొక్క ప్రస్తుత లైనప్‌లో అత్యంత ఖరీదైన ఫోన్ అని అంచనాలు వేస్తున్నారు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కంటే ఐఫోన్ 17 స్లిమ్ ఖరీదైనదిగా ఉంటుంది.

GSMArena ప్రకారం, యాపిల్ ఐఫోన్ 17 స్లిమ్ మోడల్‌ను 2025లో విడుదల చేస్తుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 2024లో లాంచ్ చేయనుంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, ఐఫోన్ ప్లస్ మోడల్ లైన్ అప్ లో ఉంటుందా అనేది అస్పష్టంగా ఉంది. ఐఫోన్ 13 మినీ స్థానంలో ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌ను పరిచయం చేసింది.

నివేదికల ప్రకారం,రాబోయే 2025లో యాపిల్ ఫోన్‌లలో ఐఫోన్ 17 స్లిమ్ అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (Iphone 17 Pro Max) కంటే ఐఫోన్ 17 స్లిమ్ ఖరీదైనదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో, కంపెనీ ఐప్యాడ్ ప్రో (2024)ని విడుదల చేసింది. ఈ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే సన్నగా ఉంటుంది.

Also Read: Iphone For Low Price in Amazon: అమెజాన్ లో బంపర్ ఆఫర్స్, తక్కువ ధరకే ఐఫోన్, వన్ ప్లస్ ఫోన్లు

అయితే, ఐఫోన్ 17 స్లిమ్ డిజైన్ (iphone 17 slim design) కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి, ఫోన్ వెనుక మధ్యలో యాపిల్ కెమెరా కాన్ఫిగరేషన్‌ (Apple Camera Configuration) ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం, iPhone 17 సిరీస్‌లో డైనమిక్ ఐలాండ్ సైజ్ మరింత తగ్గుతుంది. నివేదికల ప్రకారం, ఐఫోన్ 17 స్లిమ్ 6.6-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్ 17 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, ఐఫోన్ 17 ప్రో 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఐఫోన్ 16 సిరీస్‌లోని కొన్ని ఆధారాలను బట్టి చూస్తే, ఐఫోన్ 16కు కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. యాపిల్ ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 Plusలు కొత్త డైనమిక్ ఐలాండ్ డిజైన్‌ (Dynamic Island Design) ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రో వెర్షన్‌ల డిస్‌ప్లే సైజుని పెంచాలని యాపిల్ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఐఫోన్ 16 సిరీస్ ఎక్కువ స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు స్మాల్ బెజెల్‌లను కలిగి ఉంటుంది అని నివేదికలు చెబుతున్నాయి.

Iphone 17 Slim Update

Comments are closed.