JIO 26 Recharge: రూ.26 రీఛార్జ్ తో 28 రోజుల వ్యాలిడిటీ, జియో నుండి సూపర్ ప్లాన్

రిలయన్స్ జియో రూ.26 రీఛార్జ్ తో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

JIO 26 Recharge: రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులను తన వైపుకి తిప్పుకుంది. ఇప్పుడు జియో ఇతర నెట్‌వర్క్ సంస్థలతో పోటీపడుతోంది. ఇది సరసమైన మరియు ఆకర్షణీయమైన కొత్త రీఛార్జ్ ప్లాన్ లను ప్రారంభించి, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తోంది. రిలయన్స్ జియో (Reliance  JIO) భారతీయ టెలికాం రంగంలో అత్యధిక వినియోగదారులను కలిగి ఉంది. కంపెనీ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రోగ్రామ్‌ (Prepraid Recharge Programme) లను అందిస్తుంది, వాటిలో కొన్ని కొత్త సబ్‌స్క్రైబర్‌ (New Subscriber) లను ఆకర్షించే లక్ష్యంతో ఉన్నాయి. కేవలం రూ. 26 ప్యాకేజీ గురించి మీకు తెలుసా? అయితే వెంటనే దీని గురించి తెలుసుకుందాం.

ఈ రీచార్జ్ ప్లాన్ 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియో రూ. 26 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (Prepaid Recharge Plan) అనేది జియోఫోన్ యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేయడం వలన పరిమిత సమయం వరకు డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ప్లాన్ ప్రయోజనాల గురించి చెప్పాలంటే, ఇది కేవలం డేటా (Data) ను అందిస్తుంది. ఇది కాల్‌లు మరియు SMS వంటి ప్రయోజనాలను అందించదు.

Jio Extra Data Plans

Also Read:Registered Mobile Number For Bank: అన్ని బ్యాంకు ఖాతాలకు ఒకే నంబర్ ఉపయోగిస్తున్నారా? ఆర్బీఐ ఏం చెబుతుంది

26 ప్లాన్‌తో, వినియోగదారులు మొత్తం 2GB డేటాను అందుకుంటారు. ఈ డేటా 28 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. తక్కువ డేటా వినియోగించే లేదా JioPhoneని ఉపయోగించే వారికి ఈ ప్యాకేజీ అనువైనదిగా ఉంటుంది.

ప్రస్తుత జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్ ఏదైనా టాప్ అప్ చేయడానికి ఈ ప్లాన్ ఉపయోగించవచ్చు. ఈ ప్యాకేజీ Jio యొక్క ఇతర ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల (Other Prepaid  Recharge Plan) కంటే చాలా చౌకగా ఉంటుంది. మీరు తక్కువ డేటాను ఉపయోగిస్తుంటే, మీకు 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ కావాలంటే ఈ ప్లాన్ సరైన ఎంపిక అని చెప్పవచ్చు.

మీకు JioPhone లేకపోయినా, అటువంటి ప్రత్యేకతలను కలిగి ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్ చేయాలనుకుంటే, మీరు రూ.155 చెల్లించాలి. ఈ ప్లాన్ JioPhone కాని కస్టమర్‌లకు ఆ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ 2GB డేటా-మాత్రమే ప్యాకేజీలో మొత్తం డేటాను అది కూడా 28 రోజుల చెల్లుబాటు వ్యవధి ఉంటుంది.

Comments are closed.