Telugu Mirror: లావా ఇంటర్నేషనల్(Lava international) భారత దేశ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ తాజాగా బడ్జెట్ ఆఫర్‌లో Lava Yuva 2 బుధవారం (ఆగస్టు 2) నాడు భారతదేశంలో ప్రారంభించింది. గ్లాస్ బ్యాక్ ప్యానెల్(glass back panel)తో వస్తున్న Yuva 2 ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది మరియు ఫోన్ పై భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. కొత్త స్మార్ట్ ఫోన్ 3GB RAM మరియు 64GB నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు విభిన్న రంగుల ఆప్షన్స్ లో అందించబడుతుంది. Yuva 2 13-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ తో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్ తో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని భావిస్తున్నారు.
భారతదేశంలో Lava Yuva 2 ధర, లభ్యత
భారతదేశంలో Lava Yuva 2 ధర సింగిల్ వేరియంట్ 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999 గా ఉన్నది. కలర్ ఆప్షన్స్ వచ్చేసి గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ మరియు గ్లాస్ లావెండర్ లలో లభ్యమవుతుంది. ప్రస్తుతం యువ 2 ఫోన్ కొనుగోలు దారులకు భారత దేశం లోని లావా ఇ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంది.
Also Read:లీకైన Redmi12 5G..గ్లోబల్ లాంఛ్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న Redmi గాడ్జెట్స్
Lava Yuva 2 స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ (నానో) లావా యువ 2 ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. డివైజ్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి 269ppi పిక్సెల్ సాంద్రతతో 6.51-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్క్రీన్‌పై వాటర్‌డ్రాప్-శైలి కటౌట్ ఫోన్ లో సెల్ఫీ షూటర్ ని ఉంచడానికి అమర్చ బడింది. Lava Yuva 2 ఫోన్ 3GB RAMతో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా శక్తిని పొందుతుంది. హ్యాండ్ సెట్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా 6GB వరకు RAMకి మద్దతు ఇస్తుంది.
ఆప్టిక్స్ కోసం, కొత్త లావా యువ 2 ఫోన్ LED ఫ్లాష్‌తో 13-MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. HDR సెటప్ తో వెనుక కెమెరా వస్తుంది. పోర్ట్రెయిట్,బ్యూటీ నెస్ మరియు స్లో మోషన్‌తో సహా కెమెరా మోడ్‌లు అలాగే ఫిల్టర్‌లతో ప్రీలోడ్ చేయబడింది. సెల్ఫీలు మరియు వీడియో కాల్ ల కోసం, ఫోన్ ముందు భాగంలో ఇది స్క్రీన్ ఫ్లాష్ తో 5- మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. పరికరం 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీల పరంగా 4G, బ్లూటూత్ 5, Wi-Fi, 3.5mm ఆడియో జాక్ తో పాటు USB టైప్-C పోర్ట్ లను కలిగి ఉంది. Lava Yuva 2 లో ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. లావా హ్యాండ్‌సెట్‌లో సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
Lava Yuva 2 5,000mAh బ్యాటరీని కలిగి 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ అత్యధికంగా 40 గంటల టాక్‌టైమ్‌ను, 533 నిమిషాల సమయం వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్‌ను మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 గంటల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుందని చెప్పబడింది. అదేవిధంగా, ఫోన్ వచ్చేసి 164.96×76.1×8.7mm కొలతలతో 202 గ్రాముల బరువు ఉంటుంది.