Mobile Data Saver: మీ మొబైల్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఇలా చేయండి మరి!

మొబైల్ డేటా వెంటనే అయిపోతుందని బాధ పడుతున్నారా? అయితే, డేటా ని ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Mobile Data Saver: ఇతర దేశాలతో పోల్చితే, మన దేశం అత్యంత సరసమైన మొబైల్ డేటా ప్లాన్‌ (Mobile Data Plan) లను అందిస్తుంది. ఈరోజుల్లో డేటా వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంది. అటువంటప్పుడు, చాలా మంది వినియోగదారులు వైఫై (wifi) లేనప్పుడు రోజుకి 2 GB డేటా ప్యాక్, 1.5 GB డేటా ప్యాక్ ఉన్నప్పటికీ, రోజువారీ డేటా (Data) త్వరగా అయిపోతుంది. అలాంటప్పుడు, ఎక్స్ట్రా డేటా ను పొందడానికి మరొక డేటా ప్యాక్ కొనుగోలు చేసుకుంటారు. అయితే, మీ మొబైల్ డేటా కూడా వెంటనే అయిపోతుందా? ఆండ్రాయిడ్ ఫోన్ లో డేటా ను ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే డేటాని సేవ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ యాప్ ల డేటా ను వినియోగించకుండా నిరోధిస్తుంది. ఈ మోడ్‌ను ‘డేటా సేవర్ మోడ్’ అంటారు. డేటా సేవర్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇంటర్నల్ ఫీచర్.

డేటా సేవింగ్ ఆప్షన్ (Data Saving Option)..

డేటా సేవర్‌ (Data Saver) ని ఆన్ చేసినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్‌లు ఇంటర్నెట్‌ (internet)కి కనెక్ట్ కావు. అంటే ఎటువంటి అప్‌డేట్స్ (Updates) , నోటిఫికేషన్లు రావు. నెలవారీ డేటా (Monthly Data) ను ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తే ఈ సెట్టింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి , తక్కువ పవర్ (Low Power) ని ఉపయోగిస్తారు. దాంతో, బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. మనం ఎక్కువగా ఉపయోగించే యాప్ తక్కువ ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తుంది.

Best broadband plans with 100Mbps unlimited data speed.Best broadband plans with 100Mbps unlimited data speed.
imagge credit : Navbharat TImes

Also Read:Android 15 Beta: అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15 బీటా 2, వివరాలు తెలుసుకోండి మరి!

అవసరమైన యాప్‌లను మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

  • ఆండ్రాయిడ్‌లో డేటా సేవర్ మోడ్‌ (Data Saver Mode) ను ఎలా ప్రారంభించాలంటే..
  • ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్‌లను ఓపెన్ చేసి నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్‌ని ఆప్షన్ (Network and internet Option) ని క్లిక్ చేయండి, తర్వాత డేటా సేవర్ (Data Saver) ఆప్షన్  ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత, యూజ్ డేటా సేవర్‌ని క్లిక్ చేసి, దాన్ని ఆన్ చేయాలి.
  • దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే, యూస్ డేటా సేవర్‌ని మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది.
  • డేటా సేవర్ ఆన్ చేసిన తర్వాత కూడా కొన్ని యాప్‌లు డేటాను ఉపయోగించడం కొనసాగించాలని మీరు కోరుకుంటే, డేటా సేవర్ మెనుకి వెళ్లి, Unrestricted డేటాను ఎంచుకోండి.
  • అక్కడ, డేటాను ఉపయోగించని యాప్‌ల జాబితాను చూస్తారు.
  • అక్కడ నుండి మీకు ఇష్టమైన యాప్‌లను ఎంచుకోవచ్చు.

Mobile Data Saver

Comments are closed.