Poco M6 5G : బడ్జెట్ ధరలో Poco M6 5G స్మార్ట్ ఫోన్ భారత దేశంలో ప్రారంభం..ధర, లభ్యత ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లలో పోటీ నెలకొంది. రూ.15,000 ఫోన్ సెగ్మెంట్ లో 5G ఫోన్ రిలీజ్ చేసేందుకు పలు బ్రాండ్ లు పోటీలు పడ్డాయి. అయితే ఇప్పుడు Poco M6 5G ప్రారంభంతో ఈ పోటీ మరింతగా పెరుగుతుంది.

Telugu Mirror : Poco M6 5G రాకతో మధ్య శ్రేణి 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీ మరింతగా ఏర్పడనుంది. ఇటీవల రూ.15,000 ఫోన్ సెగ్మెంట్‌ (Phone segment) లో 5G ఫోన్‌లను విడుదల చేయడానికి Realme , Lava మరియు Poco యొక్క జోడీ సంస్థ Redmi వంటి సంస్థలు హడావిడిగా ఉన్నాయి . Poco స్మార్ట్‌ఫోన్‌ను ‘అత్యంత చౌకైన 5G ఫోన్’గా విక్రయిస్తోంది.

Poco M6 స్పెసిఫికేషన్స్ :

Poco M6 Mediatek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో ఆధారితమైనది, మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌ తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ సేఫ్టీ ని గొరిల్లా గ్లాస్ చే రక్షించబడుతుందని చెప్పబడింది, అయితే బడ్జెట్ రేంజ్ ఫోన్ కోసం ఉపయోగించిన ఖచ్చితమైన అప్ డేట్ ను కంపెనీ బహిర్గతం చేయలేదు.

Poco M6 అత్యధికంగా 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో వస్తుంది మరియు రెండు కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది : ఓరియన్ బ్లూ మరియు గెలాక్టిక్ బ్లాక్. బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ 8GB వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ తో వస్తుంది, దీనిని Poco కంపెనీ ‘టర్బో ర్యామ్’ అని పిలుస్తోంది.

poco-m6-5g-budget-priced-poco-m6-5g-smartphone-launched-in-india-price-availability-other-details
Image Credit : Gadgets 360

Also Read : PhonePe : వినియోగదారులుకు గుడ్ న్యూస్, యాప్‌లో ‘క్రెడిట్ సెక్షన్’ని ప్రారంభించిన PhonePe

కెమెరా పరంగా, Poco M6 50MP డ్యూయల్ రియర్ కెమెరా ప్రైమరీ సెన్సార్ (Primary sensor) మరియు వెల్లడించని సెకండరీ సెన్సార్‌ సెటప్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు ప్రక్క వైపున ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ఫ్రంట్ సైడ్ లో వాటర్‌డ్రాప్ డిజైన్ ఉంది. Poco M6 5G 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించడం ద్వారా స్పీడ్ గా రీఛార్జ్ చేయబడుతుంది. అయితే, Poco M6తో 10W ఛార్జర్ మాత్రమే ఇవ్వబడింది కనుక కొనుగోలుదారులు 18W ఛార్జర్‌ను విడిగా ఖరీదు చేయాలి.

భారతదేశంలో Poco M6 5G ధర :

Poco M6 ధర 4GB RAM/128GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ రూ. 10,499, 6GB RAM/128GB నిల్వ సామర్ధ్యం కలిగిన పరికరం రూ.11,499 మరియు 8GB RAM/256 నిల్వ కలిగిన వేరియంట్‌కి రూ.13,499. ICICI బ్యాంక్ కార్డ్‌ ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు రూ.1,000 తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు .

Comments are closed.