Realme P1 And P1 Pro 5G, Amazing News : భారత్ లో విడుదలైన Realme P1 5G మరియు P1 Pro 5G స్మార్ట్ ఫోన్స్, ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు

Realme నుండి తాజాగా రెండు స్మార్ట్ ఫోన్ లు భారతదేశంలో విడుదలఅయ్యాయి. మధ్య శ్రేణి ఫోన్ ల విభాగంలో విడుదలైన Realme P1 5G మరియు Realme P1 Pro 5G రెండూ కూడా 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.

Realme P1 And P1 Pro 5G : చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Realme భారతదేశంలో రెండు కొత్త హ్యాండ్ సెట్ లను విడుదలచేసింది. మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ ల సెగ్మెంట్ లో మంచి పనితీరు కలిగిన స్మార్ట్ ఫోన్ ల తయారీపై దృష్టి పెట్టిన Realme సంస్థ భారతదేశంలో తాజాగా తన రియల్‌మే P1 5G సిరీస్‌ను ప్రారంభించింది. Realme విడుదల చేసిన P1 5G మరియు Realme P1 Pro 5G స్మార్ట్ ఫోన్ ల ప్రారంభ ధర రూ.15,999.

భారతదేశంలో Realme P1 5G ధర:

Realme P1 5G 6GB RAM/128GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన వేరియంట్‌ ధర రూ.15,999 అలాగే 8GB RAM/256GB నిల్వ సామర్ధ్యం కలిగిన పరికరం ధర రూ.18,999. అదేవిధంగా Realme P1 Pro 5G 8GB RAM/128GB స్టోరేజ్ కలిగిన పరికరం ధర వచ్చేసి రూ. 21,999 మరియు 8GB RAM/256GB నిల్వ సామర్ధ్యం ఉన్న హ్యాండ్ సెట్ ధర రూ. 22,999.

కలర్ ఆప్షన్స్

Realme P1 5G పీకాక్ గ్రీన్ మరియు ఫీనిక్స్ రెడ్ రంగుల ఎంపికలో లభిస్తుంది. మరోపక్క Realme P1 Pro 5G పారోట్ బ్లూ మరియు ఫీనిక్స్ రెడ్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది.

Realme P1 And P1 Pro 5G

Realme P1 5G, Realme P1 Pro 5G స్పెసిఫికేషన్స్:

Realme P1 మరియు Realme P1 Pro 5G స్మార్ట్ ఫోన్ లు 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 2000 నిట్స్ పీక్ ప్రకాశవంతంగా ఉంటాయి.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 OS ఆధారంగా RealmeUI 5.0 పై నడుస్తాయి. Realme ఈ గాడ్జెట్ తో 3 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ నవీకరణలు మరియు 4 సంవత్సరాల భద్రతా లోపాలను పర్యవేక్షించడానికి (సెక్యూరిటీ ప్యాచ్‌) కూడా వాగ్దానం చేసింది.

ప్రాసెసర్ ముందు, Realme P1 5G MediaTek Dimensity 7050 SoC చిప్ సెట్ ద్వారా పవర్ ని పొందుతుంది అలాగే అన్ని గ్రాఫిక్స్ కు సంభంధించిన పనులకోసం Mali-G68 MC4 GPUతో కలుపబడింది. అదేవిధంగా, హై-ఎండ్ P1 ప్రో 5G పరికరం Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా Adreno GPUతో జత చేయబడింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా 8GB LPDDR4x RAM మరియు 256GB UFS 3.1 నిల్వ సామర్ధ్యం కలిగి వస్తున్నాయి. అదనంగా, ఈ హ్యాండ్ సెట్ లోని స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

P1 5G మరియు P1 Pro 5G స్మార్ట్ ఫోన్ లు రెండు కూడా కెమెరా విషయానికొస్తే 50MP సోనీ LYT600 ప్రైమరీ సెన్సార్ అలాగే 2MP సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటాయి. అయితే, P1 Pro 5Gలో 8MP పోర్ట్రెయిట్ సెన్సార్ ను కలిగి ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ అవసరాలకోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. P1 5G మరియు P1 Pro 5G పరికరాలు రెండూ, 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటాయి.

Realme P1 And P1 Pro 5G

Comments are closed.