Redmi 13C : రూ.10,000 లోపులో బ్రహ్మాండ మైన కొత్త స్మార్ట్ ఫోన్. భారత్ లో త్వరలో లాంఛ్ కానున్న Redmi 13C

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C హ్యాండ్ సెట్ ని భారతీయ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. 

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C హ్యాండ్ సెట్ ని భారతీయ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్ ప్లే కలిగి ఉండి 90 Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో గ్లోబల్ గా రిలీజ్   అయ్యింది. అయితే Redmi 13C భారత దేశంలో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో రానున్నట్లు సమాచారం. భారత్ లో Redmi 13C విడుదల సమాచారం, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Redmi 13C (గ్లోబల్) స్పెసిఫికేషన్స్ :

స్క్రీన్: Redmi 13C లో 6.74- అంగుళాల HD+ డిస్ ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, IPS LCD ప్యానెల్, 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.

ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్ అమరికను కలిగి ఉంది. ఇది 9 నానోమీటర్ పై తయారైన ప్రాసెసర్. 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ దీని సొంతం.

Also Read : Apple iPhone15 : ఇప్పుడు రూ.12,000 తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 ను Amazon India లో పొందండి. వివరాలివిగో

OS: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారిత MIUI 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Redmi 13C: A gorgeous new smartphone under Rs.10,000. Redmi 13C to be launched in India soon
Image Credit : The Times Of India

మెమొరీ: Redmi 13C డివైజ్ 4GB RAM, 6GB RAM మరియు 8GB, 128GB/256GB స్టోరేజీ వేరియంట్స్ లో నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4GB వర్చువల్ RAM ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12GB వరకు RAM పవర్ లభిస్తుంది.

కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50Mp మెయిన్ కెమెరా, 2Mp డెప్త్ సెన్సర్, 2Mp మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5Mp ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi 13C లో సేఫ్టీ కోసం రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ: Redmi 13C లో 4G, డ్యూయల్ సిమ్, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read :Samsung Galaxy : శామ్ సంగ్ నుంచి చౌకైన స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A05 భారతదేశంలో విడుదల. ధర, లభ్యత తెలుసుకోండి.

Redmi 13C ధర :

నైజీరియాలో Redmi 13C స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వెర్షన్ లలో విడుదల అయ్యింది.

4GB RAM మోడల్ ధర నైజీరియన్ కరెన్సీ లో NGN 98,100 (సుమారు రూ.10,100) గా ఉంది.

Redmi 13C 8GB ర్యామ్ మోడల్ ధర నైజీరియన్ కరెన్సీ లో NGN 108,100 (సుమారు రూ.11,100) గా ఉంది.

Redmi 13C భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Comments are closed.