Samsung Galaxy F15 : బడ్జెట్ ధరలో భారీ 6,000 mAh బ్యాటరీతో భారత్ లో విడుదలైన Samsung Galaxy F15. వివరాలు ఇలా ఉన్నాయి

Samsung Galaxy F15 : Samsung నుంచి చౌకైన ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F15 భారతదేశంలో ప్రారంభమైంది. ఇది బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో ప్రత్యర్ధి కంపెనీలు Redmi, Realme మరియు Motorola లకు గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు.

ఎలక్ట్రానిక్స్ దిగ్గజ తయారీ సంస్థ Samsung తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 5Gని భారత్ లో ప్రారంభించింది. ఇది MediaTek 6100 ప్రాసెసర్‌ ని కలిగి ఉండి 4 సంవత్సరాల OS నవీకరణలకు సపోర్ట్ చేస్తుంది. F15 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీలో పుంజుకుని నిలబడే   అవకాశం ఉంది, ప్రత్యర్థి కంపెనీలైన Redmi, Realme మరియు Motorola వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి ప్రత్యర్ధిగా నిలుస్తుంది.

Samsung Galaxy F15 Price in India:

Samsung Galaxy Galaxy F15 5G 4GB RAM/128GB నిల్వ సామర్ధ్యం గల పరికరం కోసం రూ.15,9999 ధరకు అందుబాటులో ఉంది, 6GB RAM/128GB స్టోరేజ్ కలిగి ఉన్న గాడ్జెట్ ధర రూ.16,999.

Samsung Galaxy F15 : At a budget price
Image Credit : ABP Live-ABP News

చౌకైన ఈ స్మార్ట్‌ ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లలో లభిస్తుంది: జాజీ గ్రీన్ మరియు గ్రూవీ వైలెట్ అలాగే బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy F15 Specifications:

Galaxy F15 5G 6.5-అంగుళాల పూర్తి HD+ sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉండి 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. F15 5G స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 6100 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు 6GB వరకు RAM మరియు 128GB వరకు స్టోరేజ్ కు సపోర్ట్ చేస్తుంది. Galaxy F15 5G మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ విస్తరణకు అనుకూలంగా ఉంటుంది.

Also Read : Samsung : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) లో కనిపించిన Samsung Galaxy M15 5G. లీక్ అయిన బ్యాటరీ వివరాలు

Galaxy F15 5G Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా One UI 6పై రన్ అవుతుంది మరియు Samsung ఈ ఫోన్‌తో 4 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్‌లను ప్రామిస్ చేస్తోంది, అంటే Galaxy F15 5G కనీసం Android 18 వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను అందుకుంటుంది.

స్మార్ట్‌ఫోన్ భారీ 6,000 mAh బ్యాటరీని కలిగి ఉండి 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే, ఛార్జింగ్ అడాప్టర్ బాక్స్‌లో ఇవ్వలేదు. అదేవిధంగా ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను ఆస్వాదించడానికి వినియోగదారులు అదనంగా ఖర్చు చేయాల్సి  ఉంటుంది.

 

Comments are closed.